ఈ నెల 30న శ్రీహరి కోట నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగం
24 పేలోడ్‌లను నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు
అంతరిక్ష వ్యవసాయం, డాకింగ్ పరిజ్ఞానంపై ఇస్రో అధ్యయనం
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: అంతరిక్ష రంగం లో అనేక విజయాలు సాధిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో కీల క ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్ ద్వారా వినూత్న ఉపకరణాలను ఆంధప్రదేశ్‌లోని సతీష దావన్ అంతరి క్ష కేంద్రం నుంచి ఈ నెల 30న రోదసిలోకి పంపేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. పీఎస్‌ఎల్‌వీ ద్వారా జంట స్పేడెక్స్ (స్పేస్ డాకింగ్ ఎక్స్‌పరిమెంట్) ఉపగ్రహాలను ప్రయోగిస్తుంది. ఈ ఉపగ్రహాలను ప్రయోగించిన అనంతరం పీఎస్‌ఎల్‌వీొోసీ60లోని నాలుగో దశ కక్ష్యలో వేరుకానుంది. దీన్ని ‘పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటాల్ ఎక్స్‌పెరిమెంట్ మా డ్యూల్(పీఓఈఎమ)’ పేరుతో ఒక ప్రయోగ వేదికగా ఇస్రో ఉపయోగించుకుంటుంది. ఇందులో ఇస్రోకు సంబంధించిన వివిధ ల్యాబ్‌లు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, స్టార్టప్ సంస్థలకు చెందిన 24 ప్రయోగ పేలోడ్‌లను శాస్రవేత్తలు పంపనున్నారు. అంతరిక్ష కేంద్ర నిర్మాణం సహా భవిష్యత్తులో చేపట్టబోయే మానవ సహిత ప్రయోగాలకు అవసరమైన డాకింగ్ పరిజ్ఞానాన్ని వీటి ద్వారా శాస్త్రవేత్తలు పరీక్షించనున్నారు.
ప్రయోగం విజయవంతమైతే రికార్డు సృష్టించినట్టే
పీఎస్‌ఎల్వీ ప్రయోగంలో భాగం గా దాదాపు 220కేజీల బరువు ఉన్న రెండు జంట ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపుతుంది. ఆ ఉపగ్రహాలకు చేజర్, టార్గెట్‌లుగా నామకరణం చేసి అందుకు వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో ఇస్రో పోస్ట్ చేసింది. మానవసహిత యాత్రకు సంబంధించి ఈ ప్రయోగం ఎంతో కీలకం. ఈ ప్రయోగం కనుక విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ నిలిచి రికార్డు సృష్టించనుంది.
అంతరిక్షంలో పాలకూర మొక్కలు..
అంతరిక్షంలో మైక్రోగ్రావిటీలో మొక్క ల పెరుగుదల ఎలా ఉంటుందనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడానికి సిద్ధం అయ్యారు. మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో మొ క్కల కణాల ప్రవర్తనను సాధారణ పరిస్థితులతో పోల్చి చూడటానికి స్పాడెక్స్ ప్రయో గంలో భాగంగా పాలకూర మొక్క కణాల ను శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపిస్తున్నా రు. ఇందుకోసం ముంబైలోని అమిటీ యూనివర్సిటీ ఓ ప్రత్యేక మాడ్యూల్‌ను తయారు చేసింది.
దీనిలో మొక్క కణాలకు కావాల్సిన పీడనం, తేమ, సీఓ2 స్థాయిలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సెన్సార్లను అమర్చారు. అలాగే మొక్క కణాలలో జరిగే మా ర్పులను ఎప్పటికప్పుడు రికార్డు చేయడాని కి అధునాతన కెమెరాలను కూడా అమర్చా రు. దీంతోపాటు ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసిన కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్(క్రాప్స్) అనే పేలోడ్‌ను శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపుతున్నారు.
క్లోజ్డ్ బాక్స్ వాతావరణంలో విత్తనాలను అంకురోత్పత్తి, రెండు ఆకుల దశ వరకు మొక్కల పోషణ కోసం 8 అలసంద (బబ్బె ర్లు) విత్తనాల్ని అంతరిక్షంలో పెంచాలని ఇస్రో భావిస్తోంది. అలాగే అంతరిక్ష వ్యవర్థాలను సాధ్యమైనంత వరకు నియంత్రించ డానికి ఇస్రో పనిచేస్తుంది. ఇందుకోసం పీఎస్‌ఎల్‌వీసీ60 ద్వారా రొబోటిక్ హస్తా న్ని ఇస్రో అంతరిక్షంలోకి పంపుతుంది. ఇది అత్యాధినికమైన సెనార్లు, కెమెరాలు కలిగి ఉండి.. కక్ష్యలోని శకలాలను ఒడిసిపడు తుంది. ఈ సాంకేతికను విక్రమ్ సారాభా య్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది.