calender_icon.png 10 October, 2024 | 6:50 AM

‘సముద్రయాన్’పైనా ఇస్రో కృషి

10-10-2024 01:05:22 AM

‘మత్స్య- 6000’పై సైంటిస్ట్స్ ప్రత్యేక దృష్టి

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భారతీయులను రోదసీలోకి పంపే ‘గగన్‌యాన్’పైనే కాదు.. కొంత కాలం నుంచి సముద్ర గర్భంలోకి పంపించే మానవ సహిత సబ్‌మెరైన్ ‘సముద్రయాన్’పైనా నిశ్శబ్దంగా పనిచేస్తున్నది. ఇప్పటికే అందుకు అవసరమైన అత్యాధునికమైన సాంకేతికతతో పాటు విలువైన ఇంజి నీరింగ్ పరికరాలను సమకూర్చుకునే పని లో నిమగ్నమైంది.

వీటితో సబ్‌మెరైన్‌లో అత్యంత కీలకంగా పనిచేసే ‘మత్స్య- 6000’ మాడ్యుల్‌ను సిద్ధం చేసే పనిలో తలమునకలైంది. ఈ మాడ్యుల్ సబ్‌మెరైన్‌కు గుండెకాయలా పనిచేస్తుందని, మాడ్యుల్ సబ్‌మెరైన్‌కు సపోర్ట్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్ విభాగాలు సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటు న్నారు. దీని ఆధారంగానే సబ్‌మెరైన్ నియంత్రణ ఉంటుందంటున్నారు.

మాడ్యుల్ చుట్టూ 80 ఎంఎం మందంలో టైటాని యం పొరతో  వజ్ర కాఠిన్యాన్ని కలిగి ఉం టుందని చెప్తున్నారు. ఈ మిషన్‌పై ఇన్‌చార్జి శాస్త్రవేత్త డాక్టర్ రమేశ్ మాట్లాడుతూ.. ఇస్రో ‘సీ మిషన్’పై లోతైన పరిశోధన చేస్తున్నదన్నారు. ఈ ప్రయోగాలపై ఇప్పటికే ఎన్నో సానుకూల ఫలితాలు సాధించామని తెలిపా రు. మిషన్ సక్సెస్ అవుతుందనే దృక్పథం తో ముందుకు వెళ్తున్నామని, పూర్తి కావడానికి మరింత సమయం పడుతుందన్నారు.