calender_icon.png 30 January, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇస్రో శతకం సూపర్

30-01-2025 02:09:08 AM

నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-15 రాకెట్

  1. వందో ప్రయోగం విజయవంతం
  2. నిర్ణీత కక్ష్యలోకి ఎన్వీఎస్-02 ఉపగ్రహం
  3. ఇస్రో కొత్త చైర్మన్‌కు విజయంతో స్వాగతం
  4. ఇస్రో విజయం దేశానికి గర్వకారణం: సీఎం రేవంత్‌రెడ్డి
  5. మైలురాయిగా నిలుస్తుంది: చైర్మన్ నారాయణన్

* గగనతలాన ఘనతలెన్నో లిఖిస్తున్న ఇస్రో తన 100వ ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది.  శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధ వారం ఉదయం 6.23 గంటలకు జీఎస్ ఎల్‌వీ ఎఫ్-15 రాకెట్ నింగిలోకి సగ ర్వంగా దూసుకెళ్లింది. ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టి తనకు సాటిలేదని నిరూపించుకుంది.

ఇస్రో వందో విజయం.. కొత్త చైర్మన్ నారాయణన్‌కు తొలి విజయమై ఘనస్వాగతం పలికింది. ఈ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు. చరిత్రాత్మక విజయం సాధించారని ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ఎక్స్‌లో అభినందనలు తెలిపారు.

న్యూఢిల్లీ, జనవరి 29: ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం విజయవంతమైంది. సతీ శ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం తెల్లవారుజామున జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-15 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 2,250 కిలోల బరువున్న ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

ఎన్వీఎస్-02, భారత ఉపఖండంలోని వినియోగదారులకు, అలాగే భారత్‌కు 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు కచ్చితమైన స్థానం, వేగం, సమయాన్ని అం దించడానికి ఉద్దేశించిన నావిక్(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టాలేషన్) శ్రేణిలో రెండోది.

నావిక్ రెండోతరం ఉపగ్రహాలను ఐదింటిని కలిగిఉంది. యూఆర్ శాటిలైట్ సెంటర్ డిజైన్ చేసి అభివృద్ధి చేసిన ఎన్వీఎస్-02 ఉపగ్రహం ఎల్ 1, ఎల్ 5, ఎస్ బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్‌ను కలిగి ఉంది. కాగా జీఎస్‌ఎల్వీ రాకెట్ 17వది. పూర్తి స్వదేశీ క్రయో స్టేజ్‌తో కూడిన 11వ రాకెట్.

అభినందనల వెల్లువ 

ఇస్రోకు పలువురు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. 

కొత్త చైర్మన్‌కు తొలి విజయం..

ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన నారాయణన్ మొదటి ప్ర యోగంలోనే విజయం సాధించారు. ఆయన ఇస్రో శా స్త్రవేత్తలకు శు భాకాంక్షలు తెలిపా రు. ఈ ఏడాదిలో చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని, నావిగేషన్ శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టినట్టు చెప్పా రు.

వందో ప్రయోగ ం మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఇప్పటివరకు 6 జనరేషన్ల లాంచ్ వె హికిల్స్ అభివృద్ధి చేశామని, 1979లో కలాం నేతృత్వం లో తొలి లాంచ్ వెహికిల్ ప్రయోగం జరిగిందని పేర్కొన్నారు.