52 మంది మృతి.. 72 మందికి గాయాలు
గాజాలో హమాస్ నేత కసబ్ హతం
యూఎస్, ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్
టెలీఅవీవ్, నవంబర్ 2: హెజ్‌బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఈశాన్య లెబనాన్ ప్రాంతం లోని బెకా వ్యాలీలో ఉగ్రస్థావరాలపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 52 మంది చనిపోయినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 72 మంది గాయపడ్డారు. దాడుల నుంచి ప్రజలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు దక్షిణ బీరూట్‌లోని దహియేలో ఉన్న పలు బిల్డింగ్‌లు దాడుల కారణంగా ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా రాకెట్ దాడులు చేయడంతో దాదాపు 11 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ వార్తా సంస్థలు తెలిపాయి.
హమాస్‌కు కోలుకోలేని దెబ్బ
హమాస్‌కు మరోసారి కోలుకోలేని దెబ్బ తగిలింది. గాజాలోని ఓ కారుపై జరిపిన దాడు ల్లో హమాస్ సీనియర్ అధికారి ఇజ్ అల్ చనిపోయినట్లు ఐడీఎఫ్ వెల్లడించి ంది. ఈ దాడుల్లో కసబ్ సహాయకుడు అయేష్ కూడా హతమయ్యాడు. గాజాలో మిలిటెంట్ గ్రూపులను కసబ్ సమన్వయం చేస్తుంటాడు. కసబ్ మృతిని హమాస్ ధ్రువీకరించింది.
ఇరాన్ వార్నింగ్
తమ దేశంలోని ఆర్మీ స్థావరాలు, క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసి తీవ్ర నష్టం చేయడంతో ఇజ్రాయెల్, అమెరికాలకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ రెండు దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అయితే దాడులు ఎలా, ఎప్పుడు జరుగుతాయన్న విషయాన్ని వెల్లడించకుండా ప్రతిఘట న తీవ్రంగా ఉంటుందన్నారు. శనివారం టెహ్రాన్‌లో విద్యార్థులో సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ దేశంతో పాటు తమకు అండగా ఉండే సంస్థలపై శత్రువులు దాడి చేస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని చెప్పారు.