calender_icon.png 25 October, 2024 | 5:56 AM

ఇజ్రాయెల్ ఆరోపణలు నిరాధారం

25-10-2024 01:36:12 AM

అల్ జజీరా మీడియా వెల్లడి

దోహా, అక్టోబర్ 24:  పాలస్తీనాలోని గాజాలో జరుగుతున్న యుద్ధా న్ని కవర్ చేస్తోన్న ఖతార్ దేశానికి చెందిన అల్ జజీరా మీడియా జర్నలిస్టులు ఉగ్రవాదులని ఇజ్రాయెల్ ఆరో పించింది. ఆరుగురు జర్నలిస్టులు పాలస్తీనాకు చెందిన హమాస్, ఇస్లామిక్ జిహాద్ గ్రూపులు, మిలిటెంట్ సంస్థలతో కలిసిపోయి వాటికి అనుబంధంగా పనిచేస్తున్నారని వ్యాఖ్యా నించింది. అయితే ఇజ్రాయెల్ ఆరోపణలను అల్‌జజీరా మీడియా నెట్‌వ ర్క్ ఖండించింది. తమ మీడియా సంస్థను శత్రువుగా చూస్తూ ద్వేష భావాన్ని చూపెడుతోందని, దానిలో భాగంగానే ఇటువంటి నిరాధార ఆరోపణలు చేసిందని ఇజ్రాయెల్‌పై ఫైర్ అయింది. తమ  జర్నలిస్టులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడాన్ని, వారిపై అబద్ధపు సాక్ష్యాలను చూపెట్టడాన్ని ఖండిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ ఆరోపణలతో పాలస్తీనాలో మిగిలి ఉన్న జర్నలిస్టులను అణచివేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని మండిపడింది. గాజాలో జరుగుతున్న  వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి తెలియకూడదనే కుట్రకు ఆ దేశం పాల్పడు తోందని ఆరోపించింది. గాజా సంక్షోభాన్ని అందరికీ తెలియజేస్తున్న ఒకే ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరానే తెలిపింది.