calender_icon.png 10 October, 2024 | 3:01 PM

సిరియాలో ఇజ్రాయెల్ దాడులు

10-10-2024 01:14:54 AM

హెజ్బొల్లా కీలక నేత లక్ష్యంగా అటాక్స్ 

టెల్‌అవీవ్, అక్టోబర్ 9: హెజ్బొల్లా కీలక అధికారి లక్ష్యంగా సిరియా రాజధాని డమాస్కస్‌లో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడు ల్లో ఏడుగురు మృతిచెందారు. ఆయుధాల అక్రమ రవాణాలో అతను కీలకపాత్ర పోషి ంచినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. మృతు ల్లో సదరు అధికారి ఉన్నట్లు ఎవరూ ధ్రువీకరించలేదు.

లెబనాన్‌లోని హెజ్బొల్లాకు చెందిన సొరంగ మార్గాలను తమ బలగాలు ధ్వంసం చేసింది. కొన్ని నెలలముందే వీటిని గుర్తించామని స్పష్టం చేసింది. మరోవైపు హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పైకి 180 క్షిపణులతో దాడి చేసింది. వీటిని సమర్థంగా తిప్పికొట్టినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.   

మీ దేశాన్ని మీ చేతుల్లో ఉంచుకోండి

లెబనాన్‌ను హెజ్బొల్లా అధీనంలోకి తీసుకుని ఆడిస్తోందని, ఇప్పటికైనా మీ ప్రాంతా న్ని మీ చేతుల్లోకి తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లెబనాన్ ప్రజలు, ప్రభుత్వానికి సూచించారు. ఒకప్పుడు మధ్యప్రా చ్యంలో ముత్యం లాంటి లెబవాన్‌ను హె జ్బొల్లా కారణంగా మసకబారిపోయిందని చెప్పారు. ఇప్పటికైనా మీ వైభవాన్ని తిరిగిపొందాలని సూచించారు. 

ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేయాలని ఇజ్రాయిల్ దేశంలో డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఈ మేరకు నెతన్యాహును లికుడ్ పార్టీ నేత లికుద్ కోరినట్లు స్థానికి మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్ క్షిపణి దాడులకు బదులుగా దాని  అణుస్థావరాలను ధ్వంసం చేయాలని ఇజ్రాయిల్‌కు అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా సూచించారు.  

ఇజ్రాయిల్‌కు ‘లైట్ బీమ్’

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయిల్ అమ్ములపొదిలోకి త్వరలో మరో సరికొత్త ఆయుధం చేరనుంది. లైట్ బీమ్ యాంటీ డ్రోన్ ఆయుధాన్ని అభివృద్ధి చేసింది. ఈ సరికొత్త ఆయుధ సామర్థ్యాన్ని అమెరికాలోని వాషింగ్టన్‌లో ప్రదర్శించనున్నట్లు ఇజ్రాయిల్‌కు చెందిన రఫేల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్ తెలిపింది. ఈ సంస్థ లైట్ బీమ్ లేజర్ ఇంటర్ సెప్షన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఇప్పటికే