calender_icon.png 4 October, 2024 | 4:51 AM

8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి

03-10-2024 12:26:27 AM

దక్షిణ లెబనాన్‌లో ఘటన

టెల్‌అవీవ్, అక్టోబర్ 2: లెబనాన్‌లోకి చొరబడిన ఇజ్రాయెల్ హెజ్బొల్లా లక్ష్యంగా దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమం లో   బుధవారం హెజ్బొల్లా మిలిటెంట్లతో పోరాడుతూ 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారని టెల్‌అవీవ్ పేర్కొంది. అయి తే, సైనికులు చనిపోవడానికి గల కారణాల ను వెల్లడించలేదు.

దక్షిణ లెబనాన్‌లో అమరులైన సైనికుల కుటుంబాలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంతాపం ప్రకటి ంచారు. కాగా, లెబనాన్‌లోకి 36వ డివిజన్ సైనికులు ప్రవేశించిన వీడియోను ఇజ్రాయెల్ విడుదల చేసింది. లెబనాన్‌లో రెండు విభాగాలు చురుకుగా ఉన్నాయని, హెజ్బొ ల్లా అంతమే తమ లక్ష్యమని ప్రకటించింది.