- ఏఐ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సహకరించాలి
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఇజ్రాయెల్ సంసిద్ధత చూపడంపై ఐటీ, పరిశ్రమ ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలో శుక్రవారం తనను కలిసిన ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లా డుతూ.. రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి ఇజ్రాయెల్ ఆసక్తి కనబరచడం సంతోషంగా ఉన్నదన్నారు. కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, ఆ రంగాల్లో తెలంగాణకు సహకరించాలని కోరారు.
డిఫెన్స్, వ్యవసాయం, నీటి వినియోగంలో ఆధునిక సాంకేతికత, నూతన పరిశోధనలు, పారిశ్రామిక అభివృద్ధిలో తోడ్పాటు అందించాలని మంత్రి చేసిన అభ్యర్థనకు రువెన్ అజర్ సానుకూలంగా స్పందించారు. 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని రువెన్ దృష్టికి మంత్రి తీసుకెళ్లారు.
ఏఐ, సైబర్ సెక్యూరిటీ, శిక్షణనిచ్చే వారికి అత్యాధునిక శిక్షణ (ట్రెయినింగ్ టు ట్రెయినర్స్)లో మద్దతు ఇవ్వాలని కోరారు. వ్యర్థ జలాల పునర్వినియోగ సాంకేతికలో తమకు సహకరించాలని శ్రీధర్‌బాబు కోరారు. రాష్ర్టంలో యంగ్ ఇండి యా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ఇజ్రాయెల్ ఏ పరిశ్రమ పెట్టడానికి ముందుకొ చ్చినా నైపుణ్యం కలిగిన మానవ వనరులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి వివరించారు.
నూతన పరిజ్ఞానం, పరిశ్రమల ఏర్పాటులో సాయపడితే ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవచ్చని సూచించారు. డిఫెన్స్, ఏరో స్పేస్‌లో స్టార్టప్ సంస్థలకు టెక్నాలజీ సమకూర్చి ముందుకు నడపాలని కోరారు. మౌలిక వసతుల నిర్మాణంలో రెండు దేశా లు సహకరించుకోవాలని ఇజ్రాయెల్ రాయబారి చేసిన ప్రతిపాదనకు మంత్రి ఆమోదం తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తమ దేశాన్ని సందర్శించాలని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ ఆహ్వానం పలికారు. భేటీలో ఇండో ఇజ్రాయెల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కెన్ ఉదయకుమార్, డైరెక్టర్ డా.రాధాకృష్ణ, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, ఐటీ సలహాదారు సాయికృష్ణ పాల్గొన్నారు.