calender_icon.png 19 January, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ క్యాబినెట్ ఆమోదం

19-01-2025 12:00:00 AM

న్యూఢిల్లీ, జనవరి 18: ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఒప్పం దానికి మార్గం సుగమం చేయాలని క్యాబినెట్‌కు ప్రభుత్వం సిఫార్సు చేసినట్టు ప్రధాని నెతన్యాహు కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ నేపథ్యంలో నేటి (ఆదివారం) ఉదయం నుంచి ఒప్పందం అమలు లోకి రానుంది. విడుదల చేసే 95 మంది పాలస్తీయన్ ఖైదీల జాబితాను ఇజ్రాయెల్ న్యాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే విడుదల చేసింది. కాగా అమెరికా, ఖత్తర్, మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్ మధ్య కాల్పు ల విరమణ, బందీల విడుదల ఒప్పందం జరిగింది. ఇది విజయవంతం అయిన తర్వా త యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా చర్యలు తీసుకోనున్నారు.