15-12-2024 12:25:43 AM
డమాస్కస్, డిసెంబర్ 14: తిరుగుబాటుదారుల చేతిలోకి సిరియా వెళ్లిపోవడంతో రాజధాని డమాస్క స్, దాని శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. పర్వత ప్రాంతాల కింద ఏర్పాటు చేసిన బంకర్లపై ఐడీఎఫ్ దాడులు చేస్తున్నట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్(ఎస్‌ఓహెచ్‌ఆర్) తెలిపింది. బంకర్లలోని రాకెట్లు, ఆయుధాలు, సొరంగాలు, ఆయుధ డిపోలు, బాలిస్టిక్ క్షపణి లాంచర్లను ఐడీఎఫ్ ధ్వంసం చేసిందని పేర్కొన్నది.
అలాగే బార్జేలోని మిలిటరీ సైన్స్, టెక్నాలజీకి చెందిన సామగ్రిని కూడా నాశనం చేసినట్లు వెల్లడించింది. మరోవైపు రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో బఫర్ జోన్ ప్రాం తం నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలని ఐక్యరాజ్యసమితి సూచించింది.