12 మంది వైద్య సిబ్బంది మృతి
బీరూట్, నంబర్ 15: తూర్పు లెబనాన్‌లోని బాల్‌బెక్ గ్రామంలోని సివిల్స్ డిఫెన్స్ సెంటర్‌పై గురువా రం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 12మంది వైద్య సిబ్బంది చనిపోయారని, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని లెబనీస్ తెలిపింది. వైమానిక దాడిలో కూలిపోయిన భవనం వద్ద శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.
సెప్టెంబర్ 23 నుంచి ఇజ్రాయెల్ సైన్యం హెజబొల్లాతో వివాదానిన తీవ్రతరం చేయడంతో లెబనాన్‌పై వైమానిక దాడులకు దిగుతోంది. ఈ క్రమంలో అక్టోబర్ ప్రారంభంలో ఇజ్రాయెల్ తన ఉత్తర సరిహద్దు మీదుగా లెబనాన్‌లోకి గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది.