calender_icon.png 23 January, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు

20-09-2024 02:05:20 AM

సంస్థ చీఫ్ ప్రసంగం చేస్తోన్న వేళ అటాక్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా ప్రసంగం చేస్తున్న వేళ లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. సంస్థ స్థావరాలపై దాడులు చేసింది. హెజ్బొల్లా ప్లానింగ్, మౌలిక సదుపాయాల నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్పష్టం చేసింది. దశాబ్దాలుగా పౌర నివాసాల్లో ఆయుధాలను దాచి, గృహా ల్లో సొరంగాలను తవ్విందని ఆరోపించింది. పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించడంతో పాటు దక్షిణ లెబనాన్‌ను యుద్ధ భూమిగా మార్చిందని మండిపడింది. 

బ్యాటరీలు తీసేయండి

పేజర్లు, వాకీటాకీలు పేలిన నేపథ్యంలో లెబనాన్ అప్రమత్తమైంది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలని, అందులో నుంచి బ్యాటరీలను తొలగించాలని హెజ్బొల్లా ఆదేశాలు జారీ చేసింది. బుధవారం కొన్ని ప్రాంతాల్లో వాకీటాకీలు పేలిన నేపథ్యంలో లెబనాబ్ ప్రభు త్వం ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది. ఏ ఎలక్ట్రానిక్ పరికరాలు ఎప్పుడు పేలుతాయో తెలియక గందరగోళం నెలకొంది. 

ఇజ్రాయెల్ త్రినేత్ర!

ఇజ్రాయెల్ తన అమ్ములపొది నుంచి రోజుకో ఆయుధాన్ని బయటకు తీస్తూ హెజ్‌బొల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రెండు రోజు లక్రితం వేల పేజర్లను ఏకకాలంలో పేల్చగా.. బుధవారం డజన్ల సంఖ్యలో వాకీటాకీలు, సౌర పరికరాలను బ్లాస్ట్ చేసింది. దీంతో హెజ్‌బొల్లాలో భయాందోళనలు మొదల య్యాయి. దీని వెనుక మొస్సాద్‌తో పాటు.. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ సీక్రెట్ ఇంటెలిజెన్స్ విభాగం కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దాని పేరే ‘యహిద షమోనే మతాయిమ్’ అలియాస్ యూనిట్ 8200.

అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, బ్రిటన్‌కు చెందిన జీసీహెచ్‌క్యూతో సమానంగా ఈ రహస్య ఇంటెలిజెన్స్ విభాగానికి  సామర్థ్యాలు ఉన్న ట్లు తెలుస్తోంది. ఇది ప్రధానంగా సమాచార సేకరణ, సైబర్ డిఫెన్స్ కోసం పనిచేస్తుంది. వాటికి అవసరమైన పరికరాలను అభివృద్ధి చేయడమే దీని ప్రధాన విధి. ఈ యూనిట్ అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీతో ఉగ్రవాదులపై అనేక ఆపరేషన్లను నిర్వహించి ంది. ఈ యూనిట్‌లో అత్యంత నైపుణ్యం ఉన్న 16 ఏండ్ల యువ సైనికులకు హ్యాకింగ్, ఎన్‌క్రిప్షన్, నిఘా వంటి సంక్లిష్టమైన శిక్షణ ఇస్తారు. ఈ యూనిట్ నేరుగా ప్రధానికే రిపోర్ట్ చేస్తుంది. 

ఇజ్రాయెల్‌పై ఇరాన్ కుట్ర!

ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూను హతమార్చేందుకు ఇరాన్ కుట్ర పన్నిందని అంతర్గత నిఘా సంస్థ షిన్‌బెట్ పేర్కొంది. ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోమా గల్లాంట్, షిన్‌బెట్ డైరెక్టర్ రోనెన్ బార్ సైతం ఇరాన్ హిట్‌లిస్ట్‌లో షిన్‌బెట్ వెల్లడించింది. హమాస్ పొలిటికల్  చీఫ్ హనియే ను మొసాద్ హత్య చేసినట్లు ఇరాన్ అనుమానించింది. అప్పటినుంచి ఈ ప్రయ త్నాలను ముమ్మరం చేసింది. ఈ కుట్రను అమలు చేసేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన ఓ వ్యాపారిని వాడుకున్నట్లు ప్రకటించింది. 

హెజ్‌బొల్లా లక్ష్యంగా షెల్ కంపెనీలు

హెజ్‌బొల్లాను దెబ్బతీయడానికి ఇజ్రాయిల్ అనేక పద్ధతులను వాడుతున్నది. అం దులో భాగంగానే పేజర్లను ఉపయోగించి లెబనాన్‌లో పేలుళ్లకు పాల్పడినట్లు అమెరికాకు చెందిన అధికారులు తెలిపారు. హెజ్ బొల్లాను అంతం చేయడానికి ఇజ్రాయిల్ ఎంతో ఓపికతో ప్లాన్‌ను చేసి అదును చూసిపేజర్లతో పలువురు ఉగ్రమాండర్లను మట్టు పెట్టింది. సెల్‌ఫోన్లతో ప్రమాదమని గ్రహించిన హెజ్‌బొల్లా చీఫ్ నస్రుల్లా పేజర్లను వాడుతూ తన ఉనికిని లీక్ కాకుండా చూసుకునేవాడు. ఈ విషయాన్ని గ్రహించిన ఇజ్రాయిల్ తమ ప్లాన్‌ను అమలు చేసింది.