26-03-2025 12:09:20 AM
గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు
న్యూఢిల్లీ: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ తిరిగి దాడులు ప్రారంభించిన వారం వ్యవధిలో 270 మందికిపైగా పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్టు సేవ్ ది చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి గడిచిన వారం రోజులను పిల్లల విషయంలో ప్రాణాంతకమైన రోజులుగా అభివర్ణించింది. రెండో దశ కాల్పుల విరమణకు హమాస్ ఒప్పుకోలేదని ఆరోపిస్తూ గత ఎనిమిది రోజులుగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. వరుసగా ఎనిమిదవ రోజు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 23 మంది మరణించగా ఇందులో ఏడుగురు పిల్లలున్నారు.