గాజా, అక్టోబర్ 29: ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకు తోంది. గాజాపై తాజాగా మరోసారి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఉత్తర గాజాలోని బీట్ లాహియాలోని ఓ జనావాసాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఘటనలో గృహసముదాయం కుప్ప కూ లింది. మొత్తం 55 మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. శిథి లా ల కింద పడి ఇంకా ఎంతో మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉం డవచ్చని గాజా అధికార వర్గాలు తెలిపాయి. గాజాపై వరుస దాడుల నేప థ్యంలో అక్కడి ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. చిన్నారులు, పెద్దలను కాపా డుకుంటూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.