calender_icon.png 16 March, 2025 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజాపై ఇజ్రాయెల్ దాడి

07-07-2024 01:55:55 AM

16 మంది పాలస్తీనా పౌరులు మృతి

గాజా, జూలై 6: గాజాపై ఇజ్రాయెల్ వైమానికదాడులు కొనసాగు తూనే ఉన్నాయి. తాజాగా సెంట్రల్ గాజాలోని అల్ నుసీరత్‌లో పాలస్తీనా నిరాశ్రయుల క్యాంపుపై ఇజ్రాయెల్ వైమానిక దళం బాంబుదాడులు చేయటంతో 16 మంది ప్రజలు మరణించారు. 50 మంది వరకు గాయ పడ్డారు. గత 9 నెలల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 38,098 మంది పాలస్తీనా ప్రజలు మరణించినట్టు గాజా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ ప్రతినిధి మహ్మౌద్ బసల్ తెలిపారు.