- దక్షిణ లెబనాన్‌పై వైమానిక దాడి
- సరిహద్దు గ్రామాల ప్రజలపైనా కాల్పులు
బీరుట్, నవంబర్ 29: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తుంగలో తొక్కింది. ఒప్పందం అమల్లోకి వచ్చిన మరుసటి రోజే (గురువారం) ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దక్షిణ లెబనాన్‌పై దాడి చేశాయి. రాకెట్ నిల్వ కేంద్రంలో హెజ్బొల్లా మిలిటెంట్లు క్రియాశీలకంగా ఉండటాన్ని గుర్తించి దాడి చేసినట్లు టెల్ అవీవ్ ప్రకటించింది.
అయితే, హెజ్బొల్లానే ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. కాగా వైమానిక దాడిలో ఎంత నష్టం జరిగిం దన్ని వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో స్వస్థలాలను వీడిన ప్రజలు తిరిగి రక్షణ లెబనాన్‌కు చేరుకుంటున్నారు.
ఇలా స్వస్థలాలకు తిరిగి వస్తున్న కొందరు పౌరరు లు నిషేధిత ప్రాంతాల్లో అడుగుపెడుతున్నారని ఇజ్రాయెల్ పేర్కొంది. అలా ప్రవేశించిన వారిపై కాల్పులు జరిపినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ బలగాలు ఇంకా దక్షిణ లెబనాన్‌లోనే ఉన్నట్టు వెల్లడించింది. తొందరపడి ప్రజలు సరిహద్దు గ్రామాలకు రావొ ద్దని హెచ్చరించింది. ఈ క్రమంలో అక్కడ మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గాజాలో 26 మంది మృతి
ఉత్తర, దక్షిణ గాజాపై వైమానిక దాడుల తో ఇజ్రాయెల్ గురువారం విరుచుకుపడింది. ఈ దాడుల్లో సుమారు 26 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇప్పటివరకు గాజాలో దాదాపు 44వేల మంది ప్రాణాలు కోల్పోయారు.