హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా(62)ను మట్టుబెట్ట డానికి టెహ్రాన్లో అతడు ఉంటున్న ఇంటిపై భాగంలోని గెస్ట్ హౌస్ లోకి 2నెలల ముందే బాంబులు తరలించినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ కథనాలను ఉటంకిస్తూ న్యూ యార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. టెహ్రాన్ లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్(IRGC) తాలూకు ఓ పెద్ద కాంప్లెక్స్ లో ఈ గెస్ట్ హౌస్ ఉంది. ఐాఆర్జీసీ గెస్ట్ హౌస్ లో రహస్య సమావేశానికి హనియా తరచుగా వస్తున్నాడని ముందే తెలుసుకుని... రెండు నెలల ముందే బాంబులను అమర్చి సరైన సమయంకోసం హంతకులు వేచి చూసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. కాగా తొలుత మిసైల్ అటాక్ లో ఆయన మరణించినట్లు ఊహాగానాలు వినిపించాయి.