calender_icon.png 30 October, 2024 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాల్సిందే!

08-07-2024 01:05:31 AM

ఎమ్మెల్యే కూనంనేని

హైదరాబాద్/ముషీరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాల్సిందేనని అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ‘పాలస్తీనాకు మద్దుతుగా నిలబడదాం..- ప్రపంచ శాంతి కోసం పోరాడుదాం’ అనే నినాదంతో పలు ప్రజాసంఘాలకు చెందిన నాయకులు ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఇజ్రాయెల్ యుద్ధప్రీతిని ప్రతిఒక్కరూ ఖండించాలన్నారు. ఎవరికి వారు మాకెమవుతుందేలే.. అని వదిలేస్తే ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లుతుందన్నా రు. ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలను చూశామని, మూడో ప్రపంచ యుద్ధానికి ఆస్కారమే ఇవ్వొద్దన్నారు.

బంగ్లాదేశ్ ఏర్పాటుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ సహాయ సహకారాలు అందించారని గుర్తుచేశారు. భారత్ ఆది నుంచీ శాంతి కాముకదేశమన్నారు. ఇలాంటి పెద్ద దేశ పాలకులు కూడా పాలస్తీనాపై దాడులు జరుగుతుంటే ఖండించకపోవడం శోచనీయమన్నారు. మోదీతో పాటు బీజేపీ నేతలు హిట్లర్ మార్గంలో ఉన్నారని ఆరోపించారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. పాలస్తీనాపై ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడులు చేస్తున్నదని మండిపడ్డారు. పాలస్తీనా దశాబ్దాలుగా తమ దేశాన్ని స్వతంత్య్ర దేశంగా ప్రకటించాలని పోరాడుతున్నదని గుర్తుచేశా రు. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని ఇజ్రాయెల్‌కు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ ఆ దేశం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, సంఘాల నాయకులు దిడ్డి  సుధాకర్, ఒబేదుల్లా కొత్వాల్, సారంపల్లి మల్లారెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, రఘుపాల్, విమలక్క పాల్గొన్నారు.