* 48 గంటల్లో 400 దాడులు
డమాస్కస్, డిసెంబర్ 12: తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిన సిరియా పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అధ్యక్షుడు అసద్ పారిపోవడంతో ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆస్తులపై ఇ జ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈక్రమం లో తిరుగుబాటుదారుల చేతుల్లోకి సిరియా ఆయుధ సంపత్తి వెళ్లకుండా ఆయుధాలను ధ్వంసం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. గత ౪8 గంటల్లో 400 కంటే ఎక్కువ దాడులు నిర్వహించినట్లు ఐడీఎప్ పేర్కొన్నది. ఇప్పటికే 80% శాతం సిరియా సైనిక ఆస్తులను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. అయితే సిరియా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటున్నదని ఇరాన్ ఆరోపిస్తున్నది.