calender_icon.png 4 October, 2024 | 4:54 AM

హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ అదే దూకుడు

04-10-2024 01:35:20 AM

భీకర దాడులు కొనసాగిస్తున్న టెల్‌అవీవ్

తాజా దాడుల్లో నస్రల్లా అల్లుడు మృతి

ఇజ్రాయెల్‌పై గురిపెట్టిన హౌతీ రెబెల్స్

టెల్‌అవీవ్, అక్టోబర్ 3: ఇరాన్ భీకర దాడులు చేసినా మరోవైపు లెబనాన్‌లో హెజ్బొల్లా సంస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడు లు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే హెజ్బొ ల్లా చీఫ్ హసన్ నస్రల్లా, ఆయన కుమార్తె మృతి చెందగా ఇజ్రాయెల్ దాడుల్లో తాజా గా నస్రల్లా అల్లుడు హతమైనట్లు తెలుస్తోం ది.

సిరియా రాజధాని డమాస్కస్‌లో టెల్‌అవీవ్ జరిపిన దాడుల్లో ఇద్దరు లెబనాన్లు మృతిచెందారు. వీరితో పాటు హసన్ నస్ర ల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ ఖాసిర్ మరణించినట్లు సిరియన్ హ్యూమన్‌రైట్స్ వాచ్ తెలిపింది. జాఫర్ మరణాన్ని హెజ్బొల్లాకు చెందిన మీడియా సైతం ధ్రువీకరించింది. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణ మధ్య అమెరికా పౌరుడు కమెల్ అహ్మద్ జావెద్ సైతం మృతిచెందినట్లు అగ్రరాజ్యం పేర్కొం ది. బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. 

100 మంది శిశువులకు నస్రల్లా పేరు

హెజ్బొల్లా అధినేత నస్రల్లా మరణానికి గౌరవం ప్రకటిస్తూ ఇరాక్‌లో దాదాపు 100 మంది శిశువులకు ఆయన పేరును పెట్టారు. ఈ మేరకు ఇరాక్ ఆరోగ్య శాఖ వెల్లడించిం ది. ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో నస్రల్లా మృతిచెందగా ఆయన హత్యను నిరసిస్తూ దేశంలోని పలు నగరాల్లో పెద్దఎత్తున నిరసనలు తెలిపారు.

అయితే, కాల్పుల విరమణకు నస్రల్లా అంగీకరించారని, ఈ విష యాన్ని అమెరికా, ఫ్రాన్స్ తెలియజేశామని లెబనాన్ మంత్రి అబ్దుల్లా వెల్లడించారు. ఆ ఇద్దరు అధ్యక్షులు చేసిన ప్రకటనకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అంగీకరిం చారు. కానీ తర్వాత నెతన్యాహు ఈ ప్రతిపాదనను తిరస్కరించారని, తర్వాత బీరుట్‌పై జరిగిన భీకర దాడుల్లో హెజ్బొల్లా హెడ్‌క్వార్టర్స్‌పై జరిపిన దాడిలో నస్రల్లా మరణిం చారని అబ్దుల్లా పేర్కొన్నారు. 

టెల్‌అవీవ్‌పై హౌతీ దాడులు

గాజా, లెబనాన్‌పై దాడులకు ప్రతీకారం గా ఇజ్రాయెల్‌పై యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. ఇజ్రా యెల్ భూభాగంపైకి డ్రోన్ల ద్వారా అటాక్ చేశారు. తమ డ్రోన్లు నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తిచేశాయని హౌతీలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతకుముందు కూడా ఇజ్రాయెల్‌పై హౌతీలు క్షిపణి దాడు లు నిర్వహించారు. 

గాజా ప్రధాని మృతి: ఐడీఎఫ్

గాజా స్ట్రిప్‌లో అప్రకటిత ప్రధానిగా వ్యవహరించిన రావీ ముష్తాహా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించింది. కొన్ని నెలల క్రితమే తమ దాడుల్లో రావీ మరణించినట్లు ఐడీఎఫ్, షిన్‌బెట్ తాజాగా ప్రకటించాయి. అతనితో పాటు హమాస్ పొలిటికల్ బ్యూరో నేత సమీ అల్ సిరాజ్, జనరల్ సెక్యురిటీ చీఫ్ సమీ ఉన్నట్లు తెలిపారు.  

ఇరాన్ హిట్‌లిస్ట్‌లో నెతన్యాహు!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన వేళ ప్రపంచవ్యాప్తంగా ఆందో ళన నెలకొంది. ఇరాన్ కీలక నేతలను అంతమొందించాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంగళవారం ఇరాన్ దాడుల నేపథ్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇదే విషయంపై చర్చ జరిగిందని సమాచారం.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ, విప్లవ దళంలోని కీలక కమాండర్ల పేర్లు ఇజ్రాయెల్ హిట్‌లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో ఇరాన్ హిట్‌లిస్ట్‌లోనూ ఇజ్రాయెల్ కీలక నేతలు ఉన్నట్లు కొన్ని పేర్లు వైరల్‌గా మారాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆ దేశ రక్షణమంత్రి యోవ్ గాలంట్, విదేశాంగ మం త్రి ఇజ్రాయెల్ కాట్జ్‌తో పాటు ఆర్మీ, నేవీ, వాయుసేనకు చెందిన కమాండర్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేర కు పలు పోస్టర్లు వెలిశాయి.

ఇతర నేతలపైనా దృష్టి

ఈ పోస్టర్ల విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా నెతన్యాహు కాకాపోయిన ఇతర సీనియర్ నేతలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. చీఫ్ జనరల్ స్టాఫ్ హెర్జీ హలేవి, ఆయన సహాయకుడు అమిర్ బ ర్మ్, పలు ప్రాంతాల మేజర్ జనరల్స్, సైనిక నిఘా అధిపతి ఆహరాన్ హలివా వంటివా రి వార్ల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇరాన్ దాడికి ప్రతిస్పందనగా టెహ్రాన్ అణుస్థావరాలు సహా చమురు, సహజవాయు క్షేత్రాలతో పాటు సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా దాడులు చేయాలని ఇజ్రాయెల్ దాడులు చేసేందుకు వ్యూహారచన జరిగినట్లు తెలుస్తోంది.