calender_icon.png 21 April, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైళ్లలో ఏకాంత గదులు ఏర్పాటు చేయాలి

21-04-2025 01:18:42 AM

తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి

ముషీరాబాద్, ఏప్రిల్ 20 (విజయ క్రాంతి) : ఖైదీలను కూడా తోటి మనుషులనుగానే భావించి రాష్ట్ర ప్రభుత్వాలు మాన వతా దృక్పధంతో స్పంధించి ములాఖత్ సమయంలో ఖైదీల భార్యలతో గడపటం కోసం ఇటలీ ప్రభుత్వం మాదిరిగా మన దేశంలో ఏకాంత గదులను ఎర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు.

ఈ మేరకు కవాడిగుడలో ని అడ్వకేట్ చేసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పులి గారి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ  కారణాలు ఏమైనా మన దేశంలో ఖైదీలు సంవత్సాల తరబడి జైలుశిక్ష అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోని సుప్రీమ్ కోర్టు సుచనలు, మానవ హక్కుల సం ఘాలు గతంలో కంటే ఎన్నో మార్పులు చేసి మనిషి జీచించే హక్కుకు ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు.

అయినప్పటికీ పేద వారికి కోర్టులు బేయిల్ యిచ్చినా వారికి సంబందించిన వారులేక, కొందరికి బెయిల్ ఇచ్చేవారు లేక కోర్టుల్లో పెరిగిన పనిభారం వల్ల తాము చేసిన తప్పు తప్పుకు పడే శిక్ష కంటే ఎక్కవ రోజులు తమ హక్కును కోల్పోతున్నారని అన్నారు. శిక్ష పడ్డ ఖైదీలు తమ తప్పును తెలుసుకొని సత్ ప్రవర్తనతో ఉన్నా, మారినా, ప్రభుత్వ నిర్ణయాల అలస్యం వల్ల ఇతర కారణాల వల్ల ఖైదీల జీవితాలు నా శనం అవుతున్నాయన్నారు.