calender_icon.png 16 November, 2024 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది నమ్మకద్రోహం కాదా?

06-07-2024 12:00:00 AM

ఒక ప్రజా ప్రతినిధిని నమ్ముకొని ఓటు వేస్తే అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి మారే నాయకులు తయారవుతున్నారు. ్రఅధికారంలో ఉన్నప్పుడు ఎదుటి పార్టీ వారిపై వ్యక్తిగత విమర్శలు, సవాళ్లు విసురుకున్న నాయకులు తీరా ఆ పార్టీ అధికారం కోల్పోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీలోకి క్యూ కడుతున్నారు. దానికి అభివృద్ధి అన్న ముసుగు తగిలిస్తున్నారు. ఆపద కాలంలో ఆదుకుని కింది స్థాయినుంచి పైస్థాయికి తీసుకువస్తే, అధికారం చేజారడంతోనే అధికార పార్టీలోకి జంప్ చేయడం ఓటరును మోసం చేయ డమే కదా! దేశంలోని అన్ని చోట్లా భవిష్యత్తులో ఇదే ధోరణి కనిపించే ప్రమాదం ఉంది. సిద్ధాంతాన్ని నమ్ముకొని ఎన్ని ఒడిదుడుకు లు ఎదురైనా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు గతంలో ఉన్నారు. చివరి దాకా ఒకే పార్టీలో కొనసాగారు. ప్రస్తుత పోకడలను నిరోధించాలంటే ఫిరాయింపుల చట్టాన్ని కఠినతరం చేయాలి. ఏ పార్టీలో గెలిచిన వారు ఆ పార్టీలోనే ఉండేలా చూడాలి. లేదా రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి ప్రజల మద్దతుతో తనకిష్టం వచ్చిన పార్టీలో చేరవచ్చు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లే ‘ జంప్ జిలానీ’లను నిరోధించాలి.

 అయినం రఘురామరావు, ఖమ్మం.