calender_icon.png 9 January, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది క్విడ్‌ప్రోకో కాదా?

09-01-2025 01:19:18 AM

  1. గ్రీన్‌కో తప్పుకుందా?.. తప్పించారా..!
  2. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
  3. ఆ దిశగానే ఏసీబీ విచారణ కొనసాగే అవకాశం

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్న ఫార్ములా ఈ-రేస్ కుంభకోణంలో, తప్పుకున్నారా... తప్పించారా.. అనేది ఇప్పుడు రాజకీయ వర్గా ల్లో తీవ్ర చర్చకు దారితీసిన అంశం. ఫార్ములా ఈ వ్యవహారంలో.. తాజాగా ఎలక్టోరల్ బాండ్ల విషయం తెరపైకి రావడంతో..ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారింది.

హైదరాబాద్‌లో ఫార్ములా -ఈ 9, 10, 11, 12 రేసులు నిర్వహించేందుకు యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఎఫ్‌ఈవో, హెచ్‌ఎండీఏ తో పాటు వీటికి స్పాన్సర్‌గా ముందుకు వచ్చి ఒప్పందం చేసుకున్న గ్రీన్‌కో అనుబంధ సంస్థ ‘ఏస్ నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ మధ్యన కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం నుంచి అకస్మాత్తుగా తప్పుకోవడం వెనుక ఏం జరిగిందనే కోణంలోనే..

అస లు ఆ సంస్థ నష్టాలు వచ్చాయని తప్పుకుందా.. లేక ఇక అవసరం లేదని తప్పిం చారా అనే దుమారాన్ని సృష్టిస్తోంది. పైగా రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణలు, ఏసీబీ వర్గాలు సాగిస్తున్న విచారణ కోణంలో ఆలోచిస్తే.. క్విడ్‌ప్రోకో పూర్తయ్యింది కనుకనే సంస్థ తప్పుకుందా అనే చర్చకూడా మొదలయ్యింది. 

క్విడ్‌ప్రోకో కాదా..

హెచ్‌ఎండీతో కలిసి యూకేకు చెంది న ఎఫ్‌ఈవో సంస్థ, అలాగే గ్రీన్‌కో అనుబంధ సంస్థ అయిన ఏస్ నెక్స్ జెన్ ప్రైవేట్ లి. సంస్థల మధ్యన 2022 అక్టోబర్ 15న త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చు కున్నాయి. అయితే నిజానికి తెరవెనుక మరోలా జరిగిందనే విమర్శనాస్త్రాలను రాజకీయ విశ్లేసకులుకూడా దూస్తున్నారు. త్రైపాక్షిక ఒప్పందం కుదరక ముందే..

అంటే 2022 ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో గ్రీన్‌కో అనుబంధ సంస్థలు భారీ గా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశా యి. వీటిని ఆ సమయంలో అధికార పక్షమైన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కు అందించాయి. ఇలా ఎలక్టోరల్ బాండ్ల ను అందించిన సంస్థల్లో.. ఆష్మాన్ ఎనర్జీ లి., అచింత్యా సోలార్ పవర్ ప్రై.లి., గ్రీన్ కో బడ్‌హిల్ హైడ్రో పవర్ ప్రై. లి.,

సనో లా విండ్ ప్రాజెక్ట్ ప్రై. లి. వంటి మొత్తం 20 సంస్థలు బీఆర్‌ఎస్ పార్టీకి 2022 ఏప్రిల్ 8న రూ. 31 కోట్లు,  2022 అక్టోబర్ 10 తారీఖున సుమారు ఆరు సంస్థల తరఫున రూ. 10 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను అందించాయి. ఇక్కడే రాజకీయ విమర్శలకు, రాజకీయ విశ్లేషకులకు, సామాన్యులకుకూడా అనుమానాలు తలెత్తుతు న్నాయి.

ఒప్పందం జరుగుతుందని ముందే తెలుసు కనుక.. ఒప్పందానికి ముందే అధికార బీఆర్‌ఎస్ పార్టీకి రూ. 41 కోట్ల నిధులను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సమకూర్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఆ ఒప్పందం కోసమే ముం దుగానే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులను సమకూర్చడం క్విడ్ ప్రోకో కాక మరే మిటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

 పైగా 2023 ఫిబ్రవరిలో ఫార్ములా -ఈ 9వ రేసును నిర్వహించిన సంస్థ.. 2024లో ఫిబ్రవరిలో మరో రేసు నిర్వహించకుండానే.. స్పానర్‌షిప్ నుంచి ఏస్ నెక్స్ జెన్ ప్రై. లి. సంస్థ ఒప్పందం నుంచి 2023 అక్టోబబర్ 27న రద్దు చేసుకుని తప్పుకుంది. దీనితో రేస్‌ను నిర్వహించేందుకు వీలుగా హెచ్‌ఎండీఏ ఎఫ్‌ఈవోతో చర్చలు జరిపి.. రేస్ నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏ రూ. 46 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. ఇక్కడే మరో ప్రశ్న ఉదయిస్తోంది.

తప్పుకుందా.. తప్పించారా..

వాస్తవానికి ప్రభుత్వంతోగానీ.. ప్రభుత్వ సంస్థలతోగానీ ఏదైనా ప్రైవేటు సంస్థ ఒప్పం దం చేసుకుని.. అర్ధాంతరంగా తప్పుకున్నప్పుడు.. దీనిపై ప్రభుత్వం ఏమాత్రం చర్చిం చకుండా.. సదరు సంస్థను ప్రశ్నించకుండా ఎలా వదిలి పెడతారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా అటు రాజకీయ ప్రత్య ర్థులు, ఇటు ఏసీబీ విచారణ బృందంకూడా దృష్టి సారిస్తున్న అంశంగా నిలిచింది.

అర్ధాంతరంగా ఒప్పందం నుంచి తొలగిన గ్రీన్‌కో అనుబంధ సంస్థ ఏస్ నెక్స్ జెన్ ప్రై.లి. సంస్థపై వాస్తవానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి.. అందులో నిందితులుగా ఉన్నవారు మాత్రం.. నష్ట పోయా రు కనుకనే ఒప్పందం రద్దు చేసుకున్నారని చెప్పడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులు సమకూర్చగానే.. పని అయిపోందని.. క్విడ్ ప్రోకో పూర్తవ్వడంతో.. అలాగే ఒప్పందంలో భాగస్వామిగా ఉంటే.. తలనొప్పులు వస్తాయనే ఉద్దేశంతోనే సంస్థ ను తెలివిగా తప్పించారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే ఏసీబీ విచారణ మరింత లోతుగా జరిగితేగానీ.. నష్టం వస్తుందని తప్పుకుందా.. లేదా తప్పించారా అనేది తేటతెల్లం అవుతుందని అధికార పక్షం నేతలుకూడా అభిప్రాయ పడుతున్నారు.ఒప్పందం నుంచి తప్పుకున్న సంస్థపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. ఏకంగా రేసు నిర్వహణ బాధ్యతను తానే తీసుకుని.. యూకేకు చెందిన ఎఫ్‌ఈవో సంస్థకు రూ. 46 కోట్లు విడుదల.. అందులోనూ పౌండ్ల రూపంలో విడుదల చేయ డంంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే తీవ్ర వివాదాస్పద అంశంగా కనపడుతోంది. మంత్రివర్గం అనుమతి లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా ఈ మొ త్తాన్ని నేరుగా.. అదీ.. ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నప్పుడు విడుదల చేయడంపై ఇప్పు డు ఏసీబీ విచారణ బృందం దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌కు పార్టీ ఫండ్ గా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులు ఇచ్చినందునే..

సదరు సంస్థను మెల్లగా తప్పించారా అనే అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి.. ఇటు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పార్టీకి నిధులు రావడం.. అటు ఫార్ములా ఈ-రేస్‌పై ఒప్పందం జరగం.. క్విడ్ ప్రోకో అంటు న్న విశ్లేషకులు..

ఆపై ఒప్పందం నుంచి త ప్పుకున్న సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు చెల్లించడంకూడా అవినీతి కిందకు వస్తుందని.. అదే కోణంలో ఏసీబీ వి చారణ బృందం ముందుకు సాగుతున్నట్టు గా విశ్లేషకులు భావిస్తుండటం గమనార్హం.