ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటనతో పెరిగిన ప్రాముఖ్యం
జగిత్యాల, జూన్ 29 (విజయక్రాంతి): కొండగట్టు అంజన్న ఆలయ ప్రతిష్ఠాత్మకత తెలంగాణ వాళ్లకు తెలియందేమీ కాదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ కొండగట్టు ఆంజనేయసామి ఆలయానికి రావడం, మొక్కులు చెల్లించుకోవడంతో అంజన్న ఆలయ విశిష్టత తెలుసుకోవాలనే ఆతృత మరింతగా పెరుగుతుంది. మహిమతో కూడుకున్న కొండగట్టు ఆలయం ఇది. సాక్షాత్తూ ఆ ఆంజనేయ సామి కొలువుదీరిన కొండగా ప్రాశస్త్యంగా చెప్పుకుంటారు. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన కొండగట్టు ప్రకృతి సౌందర్యాలతో భక్తుల, పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది.
కొండగట్టుపైన ఆంజనేయుని ఆలయం 400 ఏళ్లకు క్రితం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఆంజనేయుడు సయంభుగా వెలిశాడని తెలుస్తుంది. 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి అంజనేయుడు కనిపించినట్లు, సంజీవుడు ఆవులు మేపుతూ, ఈ కొండ ప్రాంతానికొచ్చిన సమయంలో ఒక ఆవు మందలోని నుంచి తప్పిపోగా ఆ ఆవును వెతికి అలసిన సంజీవుడు చింత చెట్టుకింద సేదదీరుతూ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడే హనుమంతుడు కలలోకి వచ్చి తాను కోరంద పొదలో ఉన్నానని, తనకు ఎండ, వాన, ముండ్ల నుంచి రక్షణ కల్పించాలని కోరాడట. ఆవు జాడ అదిగో అని అదృశ్యం కాగా సంజీవుడు ఉలిక్కిపడి లేచి, ఆవును వెతకడంతో ఆంజనేయుడు కంటపడ్డాడని సహచరులతో కలిసి అంజన్నకు చిన్న ఆలయం నిర్మించాడు.
ఓ వైపు నృసింహసామి, మరో వైపు ఆంజనేయసామి ముఖాలున్న ఆ విగ్రహాన్ని గ్రామస్థులు ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖు చక్రాలు హృదయంలో సీతారాములు ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. రామరావణ యుద్ధం జరిగేటప్పుడు లక్ష్మణుడు మూర్చపోగా సంజీవని తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరి సంజీవనికి బదులు ఆ పరతాన్నే తీసుకొస్తుండగా ముత్యంపేటలోని ఈ మార్గంలో కొంత భాగము విరిగిపడింది. ఆ భాగాన్నే కొండగట్టుగా పిలుస్తున్నారు. ఈ అలయాన్ని ఆవులకాపరి సంజీవుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కొండగట్టు ఆలయానికి 160 ఏళ్ల క్రితం కృష్ణారావు దేశ్‌ముఖ్ తిరిగి నిర్మించినట్లు తెలుస్తుంది.
సంతానం లేనోళ్లు దరిస్తే
ఆంజనేయసామికి 40 రోజులు నియమనిష్టలతో పూజ చేస్తే సంతానం లేనోళ్లకు సంతానం కలుగుతుందని భక్తుల అపారమైన విశాసం. విశేష పండగల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు ఆంజనేయసామిని దరించుకుంటారు. రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌కు 160 కిలోమీటర్ల దూరంలోనున్న కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్లడానికి ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి ప్రతిరోజు 30 నిమిషాలకోసారి కరీంనగర్, అక్కడి నుంచి ప్రతి రోజూ 30 నిమిషాలకో బస్సు, సరీస్, ప్రైవేటు క్యాబ్‌లు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం కొండగట్టు ఆంజనేయసామిని దరించుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తెలంగాణలో ఆయన అడుగు పెట్టారు. పవన్ వారాహీ యాత్రను ప్రారంభించే ముందు కొండగట్టులోనే వాహనానికి పూజ చేసి మొదలుపెట్టారు.