calender_icon.png 6 January, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విరామానికి అసలు కారణం అదా?

01-12-2024 01:17:29 AM

కొద్ది కాలం పాటు రాజకీయాలకు బ్రేక్ తీసుకుంటున్నానని కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారితీసింది. స్కూలుకెళ్లే పిల్లాడు సెలవు పెట్టినట్టు కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ చెప్పడంపై ప్రజలు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష నేతకు విరామాలేంటని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. బ్రేక్‌పై వెళ్లడానికి కేటీఆర్ ఏమైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా? అని చలోక్తులు విసురుతున్నారు.

అయితే కేటీఆర్ నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏమై ఉంటుందా? అన్న చర్చ కూడా సాగుతోంది. ఇటీవల మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌రావు, కవిత కలిసి పోయారని.. కేటీఆర్‌ను కేసీఆర్ పక్కన పెడుతున్నారని ఆసక్తికర మాటలు చెప్పారు. మరుసటి రోజే కేటీఆర్ ఈ రకంగా ట్వీట్ చేయడంతో రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది.

అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలకుల అవినీతిపై చేపట్టిన దర్యాప్తులో భాగంగా కేసులకు భయపడే ఇలా విరామం తీసుకుంటున్నారని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కవిత మళ్లీ చురుకుగా వ్యవహరించడం కూడా ఒక కారణం అయి ఉంటుందని మరి కొందరు అనుకుంటున్నారు. ప్రజాప్రతినిధి హోదాలో ఉండి విరామం తీసుకుంటే ప్రజాసమస్యలు తీర్చేదెవరని ప్రశ్నిస్తున్నారు.