08-03-2025 12:00:00 AM
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న చిత్రం ‘జాక్ - కొంచెం క్రాక్’. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌తో అంచనాలు పెరిగాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ‘పాబ్లో నెరుడా..’ అనే ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించారు. అచ్చు రాజమణి బాణీ కట్టగా, బెన్నీ దయాల్ ఆలపించారు. ‘ఏ ఉప్పెనలూ చూడక్కర్లా.. తన ఉత్సాహం చూస్తే చాలదా.. ఏ అద్భుతమూ చూడక్కర్లా..
తన పోరాటం చూస్తే చాలదా..’ హీరోను పరిచయం చేసే ఈ గీతం సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచేసింది. సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా ఈ చిత్రం లో వైష్ణవిచైతన్య నటిస్తుండగా.. ప్రకాశ్‌రాజ్, నరేశ్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది.