- ఫ్యాక్టరీల నుంచి చెరువులోకి పైప్‌లైన్లు
- వ్యర్థ పదార్థాలు డంపింగ్.. వృథా జలాలు పంపింగ్
- పట్టించుకోని కాలుష్య నియంత్రణ అధికారులు
సంగారెడ్డి, సెస్టెంబర్ 23 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ పరిధిలో 187 ఎకరాల్లోని పెద్దచెరువు రసా యనిక వ్యర్థాలతో కలుషితమైంది. కనీసం చేపలు పెరగలేనంత, పశువులు తాగలేనంత విషపూరితమైంది. చుట్టుపక్కన వందల సంఖ్యలో ఫ్యాక్టరీల నుంచి రసాయనిక వ్యర్థాలు చెరువులో చేరుతుండడంతోనే ఈ దుస్థితి. అలాగే చెరువు చుట్టూ ఫ్యాక్టరీ యాజమాన్యాలు పేలిన బలర్లు పెడుతున్నాయి. చెరువులోకి అక్రమంగా పైప్‌లైన్లు వేసి మరీ వ్యర్థాలు, కలుషిత జలాలను చెరువులోకి పంపింగ్ చేస్తున్నాయి. దీంతో చెరువులోని జలా లు పూర్తిగా కలుషితమయ్యాయి. భూగర్భ జలా లు సైతం తాగేందుకు పనికి రాకుండా పోతున్నా యి.
అలాగే పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో కొందరు కడీలు ఏర్పాటు చేశారు. అక్రమంగా కట్టడాలు నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఎఫ్‌టీఎల్ పరిధిలో మట్టిపోసి ప్రహరీలు సైతం నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నా రు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిశ్రమల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చెరువులోకి వ్యర్థాలు చేరకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.