calender_icon.png 28 November, 2024 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాలో ఇస్కాన్‌ను నిషేధించాలి

28-11-2024 05:35:00 AM

  1. ఢాకా హైకోర్టులో పిటిషన్ 
  2. చిన్మయ్ అరెస్టును ఖండించిన భారత్

ఢాకా, నవంబర్ 27: బంగ్లాదేశ్ జెండాను అవమానించారన్న ఆరోపణలపై ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును ఢాకా ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశంలోని హిందువుల ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఇస్కాన్‌ను తమ దేశంలో నిషేధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్కాన్  కార్యకలాపాలపై దృష్టిసారిస్తున్నట్లు ఢాకా ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. దేశంలోని శాంతిభద్రతల పరిస్థితిని గురువారం ఉదయంలోపు నివేదించాలని అటార్నీ జనరల్ ను హైకోర్టు ఆదేశించింది.

పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీయకుండా చూడాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం.. ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ గతనెలలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. 

భారత్ ఆందోళన.. బంగ్లా ఖండన

బంగ్లాదేశ్‌లో ఇప్పటికే హిందువులు, మై నార్టీలపై తీవ్రవాద గ్రూపులు దాడులకు పా ల్పడుతున్న నేపథ్యంలో చిన్మయ్ దాస్ అరె స్టు, తదనంతర పరిణామాలపై భారత్ ఆం దోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీల పై దాడులు సరికావని పేర్కొంది.

హిందువు లు, మైనార్టీలకు భద్రత కల్పించాలని అక్కడి అధికారులను కోరుతూ భారత విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. అయితే చిన్మయ్ అరెస్టును కొన్ని వర్గాలు తప్పుగా అర్థం చేసుకు న్నారని, భారత ప్రకటన నిరాధారమైనదని బంగ్లాదేశ్ పేర్కొంది. స్నేహస్ఫూర్తికి విరుద్ధంగా భారత విదేశాంగ ప్రకటన ఉందని ఆరోపించింది. 

చిన్మయ్ న్యాయవాది మరణం

ఇస్కాన్ గురువు చిన్మయ్‌దాస్‌పై దేశద్రో హం కేసు నమోదు చేసిన యూనస్ ప్రభు త్వం ఢాకాలో ఆయనను అరెస్టు చేసి మంగళవారం చిట్టోగ్రామ్ కోర్టులో హాజరుపరిచా రు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న హిం దువులపై పోలీసులు దాడి చేశారు. కోర్టు వెలుపల జరిగిన పోలీస్ హింసలో చిన్మయ్ తరఫు ముస్లిం లాయర్ మరణించారు.