మరో 17 మంది లావాదేవీలను నిలిపేసిన బంగ్లా
ఢాకా, నవంబర్ 29: ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్‌లో అరెస్టయిన కేసులో ఆ దేశం పోలీసులు దర్యాప్తును ము మ్మరం చేశారు. చిన్మయ్ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆయనతో పాటు ఇస్కాన్‌తో సంబంధం ఉన్న మరో 17 మంది ఖాతాల లావాదేవీలను కూడా నెలరోజుల పాటు నిలిపివేయ నున్నట్లు పేర్కొన్నారు.
అక్టోబర్ 25న ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్, బంగ్లా జెండాను కించపరిచారన్న ఆరోపణలున్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత ఫిర్యాదు మేరకు అదే నెల 30న కృష్ణదాస్‌తో పాటు 18 మందిపై కేసు నమోదు చేశారు. సోమవారం ఢాకా ఎయిర్‌పోర్ట్‌లో అతన్ని అరెస్ట్ చేశారు.
కృష్ణదాస్‌కు అండగా ఉంటాం..
పోలీసుల అదుపులో ఉన్న చిన్మయ్ కృష్ణదాస్‌తో బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ ప్రతినిధులు దూరం పాటిస్తున్నారని జరుగుతున్న వార్తలను సంస్థ ఖండించింది. చిన్మయ్‌కు ఎప్ప టిలాగానే అండగా ఉంటామని స్పష్టం చేసింది. దేశంలోని హిందువుల హక్కుల పరిరక్షణకు తామంతా కృషి చేస్తామని తెలిపింది. కృష్ణదాస్‌ను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.