ఢాకా, నవంబర్ 25: బంగ్లా దేశ్‌లో షేక్ హసీనా ప్రభు త్వం పడిపోయిన తర్వాత హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై నిరసన గళం వినిపిస్తున్న ‘ఇస్కాన్’ గురువు చిన్మయ్ కృష్ణదాస్ ప్రభుపై తాత్కాలిక యూనస్ ప్రభుత్వం దోశద్రోహం కేసు మోపింది. సోమవారం ఆయన చిట్టగాంగ్ వెళ్లేందుకు ఢాకాలోని షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయాని కి చేరుకోగా, ఆయన్ను డిటెక్టివ్ బ్రాంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆయన అరెస్ట్‌ను బంగ్లా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. కానీ, భారత సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సీనియర్ అడ్వైజర్ కంచన్ గుప్తా అరెస్ట్‌ను సోషల్‌మీడియా మాధ్యమంగా ధ్రువీకరించారు. చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు కొద్దిరోజులుగా ‘సనాతన్ జాగరణ్ మంచ్’ తరఫున హిందుత్వ శ్రేణుల ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. బంగ్లా ప్రభుత్వం ఇప్పటికే ఆయన్ను దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తున్నది.