calender_icon.png 25 April, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంభీర్‌కు ఐసిస్ కశ్మీర్ బెదిరింపులు

25-04-2025 02:22:56 AM

‘ఐ కిల్ యూ’ అని మెయిల్ సందేశం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: భారత క్రికెట్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) కశ్మీర్ నుంచి హత్యా బెదిరింపులు వచ్చాయి. ‘ఐ కిల్ యూ’ అని మెయిల్ పంపించడం కలకలం రేపింది. పహల్గాం ఉగ్రదాడి జరిగిన రెండు రోజులకే హత్యా బెదిరింపులు రావడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐసిస్ బెదిరింపులపై గంభీర్ ఢిల్లీలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

తమకు రక్షణ కలిగించాలని ఢిల్లీ పోలీసులను కోరినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెయిల్ నిజంగా ఐసిస్ పంపించిందా అన్న దానిపై ఆరా తీస్తోంది. అందుకోసం సైబర్ సెల్ చురుగ్గా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిపై గంభీర్ ‘ఎక్స్’లో పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.

‘ఉగ్రదాడిలో మృతి చెందినవారి కోసం ప్రార్థిద్దాం. దీనికి బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది’ అని పోస్టు చేశాడు. పోస్టు పెట్టిన ఒక్కరోజు వ్యవధిలోనే ఐసిస్ నుంచి హత్యా బెది రింపుల రావడం గమనార్హం.