calender_icon.png 19 January, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల్ని చంపి.. భోజనంగా పెట్టి

21-10-2024 01:17:47 AM

టెల్ అవీవ్, అక్టోబర్ 20: అత్యంత క్రూరమైన చర్యలకు పాల్పడే ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన మరో రాక్షస చర్య తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫౌజి యా అమీన్ సిడో అనే మహిళను లెబనాన్‌లో పదేండ్ల క్రితం ఐసిస్ ఉగ్రవాదులు అపహరించారు. ఆమెను ఇజ్రాయెల్ సైనికులు ఇటీవల రక్షించారు. గత పదేండ్లలో తాను ఎదుర్కొన్న దారుణ హింసను ఆమె మీడియాకు తెలిపారు.

‘2014లో ఐసిస్ ఉగ్రవాదులు 200 మంది మహిళలు, పిల్లలను బంధీలుగా చేసుకొన్నారు. వారిలో నాతోపాటు నా సోదరులు కూడా ఉన్నా రు. అప్పుడు నా వయసు 9 ఏండ్లు. మమ్మ ల్ని బంధించిన తర్వాత మూడు రోజులు తిండి కూడా పెట్టలేదు. తర్వాత మాంసాహారం పెట్టారు. అది దుర్వాసన వచ్చింది. అది తినగానే కొందరికి ఆరోగ్యం దెబ్బతిన్నది.

ఆ ఆహారం యజిదీ తెగవారి శిశువుల ను చంపి వండినదని ఆ తర్వాత మాకు చెప్పారు. చిన్నారులను చంపి వండుతున్న ఫొటోలను కూడా చూపించారు. మీ పిల్లలను మీరే తిన్నారని కర్కషంగా మాట్లాడా రు. దీంతో ఓ మహిళ కనిపించకుండా పోయిన తన బిడ్డను తలుచుకొని మరణించింది’ అని తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలను వెల్లడించింది.