calender_icon.png 17 October, 2024 | 6:00 AM

గోమాతను కొలిచిన వారింట్లో ఐష్టుశ్వైర్యాలు

17-10-2024 01:08:02 AM

  1. జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి

ముంబైలో గోధ్వజ స్థాపన చేసిన స్వామీజీ

ముంబై, అక్టోబర్ 16: గోమాతను కొలిచిన వారింట్లో ఐష్టుశ్వైర్యాలు తులతూగు తాయని ఉత్తరాఖండ్ జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి అన్నా రు. గోధ్వజ స్థాపన భారత్ యాత్రలో భాగంగా బుధవారం స్వామీజీ మహారాష్ట్రకు చేరుకున్నారు. ముంబైలోని సీసీ ట్యాంక్ రో డ్ శ్రీలక్ష్మీ నారాయణస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

మాధవ్ భాగ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోధ్వజ స్థాపన చేశారు. అనంతరం ‘జ్యోతిర్మఠ్ భద్రికాశ్రమ్ హిమాలయ సంస్థ’ ముద్రించిన ‘గో అష్టోత్తరశతి’ అనే ఆధ్యాత్మిక గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వామీజీ అనుగ్రహ ప్రవచనమిస్తూ.. శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, వేదా లు.. ఇలా అన్నింట్లోనూ గోవు తల్లితో సమానమని రాసి ఉందన్నారు.

తమకు ఇష్టమైన ధర్మాన్ని ఎవరైనా.. ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చని భారత రాజ్యాంగం చెప్తుంద న్నారు. గోమాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసి కేంద్ర ప్రభుత్వం గణనీయమన ఆదాయాన్ని పొందుతున్నదన్నారు. దేశంలోని 80 కోట్ల మంది హిందువులంతా ఒక్కటై గోవును రాష్ట్రమాత చేయాలని డిమాండ్ చేయాలన్నారు. గోమాతను రాష్ట్రమాత డిమాండ్‌తో ఎవరైతే ఓట్లడగుతారో వారికే గోమాతను పూజించే వారు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.