calender_icon.png 19 October, 2024 | 3:47 AM

ఈశా’కు సుప్రీంలో ఊరట

19-10-2024 02:00:03 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: తమిళనాడు కోయంబత్తూర్‌లో సద్గురు జగ్గీవాసుదేవ్ నిర్వహిస్తున్న ఈశా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈశా ఫౌండేషన్ లో తమ కూతుళ్లకు బ్రెయిన్ వాష్ చేసి సన్యాసం వైపు మళ్లించారని ఆరోపిస్తూ ఓ ప్రొఫెసర్ మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ఇద్దరు మహిళలు గీత (42), లత (39) మేజర్లు అని, వారి ఇష్టపూర్వకంగానే అశ్రమంలో ఉంటున్నందున ఈ పిటి షన్ చట్టవిరుద్ధమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.

ఈ కేసులో మద్రాస్ హైకోర్టు పూర్తి అనుచితంగా వ్యవహరించిందని పేర్కొంది. కాగా, పిటిషన్ కూతుళ్లలో ఒకరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను, నా సోదరి స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగానే ఈషాలో చేరాం. ఇందులో ఎవరి బలవంతం, ఒత్తిడి లేదు. మా తండ్రి 8 ఏళ్లుగా మమ్మల్ని వేధిస్తున్నారు అని కోర్టుకు తెలిపారు.