calender_icon.png 18 November, 2024 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెంచరీతో కదం తొక్కిన ఇషాన్

17-08-2024 12:00:00 AM

చెన్నై: టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తమిళనాడులో జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో సెంచరీతో కదం తొక్కాడు. జార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కిషన్ మొదటి మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ మీద సెంచరీ చేశాడు. గత కొద్ది రోజుల నుంచి ఇషాన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడడం లేదు. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు విముఖత చూపడంతో అతడి మీద సీరియస్ అయిన బోర్డు సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది. ఇక అనూహ్యంగా బుచ్చిబాటు టోర్నమెంట్‌లో ఆడేందుకు ముందుకు వచ్చిన ఇషాన్‌కు జార్ఖండ్ జట్టు పగ్గాలు అప్పగించారు. తన మొదటి మ్యాచ్‌లోనే ఇషాన్ తన మార్కు చూపెట్టాడు.

98 పరుగుల వద్ద ఉన్నపుడు సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన తీరు అమోఘం. ఐపీఎల్ ఇషాన్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 26 ఏళ్ల ఇషాన్ కేవలం 86 బంతుల్లోనే సెంచరీ చేసి తన జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మొదట బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ 225 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇషాన్ కిషన్ చివరిసారిగా నవంబర్ 2023లో ఆస్ట్రేలియాతో టీ20లు ఆడాడు. మరి బుచ్చిబాబు టోర్నీ, దులీప్ ట్రోఫీల్లో ఇషాన్ నిలకడైన ప్రదర్శనలు చేస్తే మరలా అతడికి జాతీయ జట్టులో చోటు లభిస్తుందేమో చూడాలి.