calender_icon.png 17 November, 2024 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా ఇషా

12-06-2024 12:50:06 AM

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు రైఫిల్, పిస్టల్ విభాగంలో 15 మంది తో కూడిన భారత షూటర్ల బృందాన్ని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) మంగళవారం ప్రకటించింది. తెలంగాణ షూటర్ ఇషా సింగ్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా బరి లోకి దిగనుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో  హైదరాబాదీ షూటర్ పోటీ పడనుంది. ఢిల్లీలో వర్చువల్ సమావేశం అనంతరం ప్రకటించిన బృందంలో 8 మంది రైఫిల్, ఏడుగురు పిస్టల్ విభాగంలో పోటీ పడనున్నారు.

భార త టాప్ షూటర్ మనూ భాకర్ రెండు వ్యక్తిగత విభాగాల్లో పోటీ పడనుండడం విశేషం. మహిళల 10 మీటర్లు, 25 మీటర్ల విభాగంలో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించు కోనుంది. ఇక షాట్‌గన్ విభాగంలో బృందా న్ని లొనాటో వేదికగా జరిగే ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ అనంతరం ప్రకటించనున్నారు. బుధవారం నుంచి జూన్ 18 వరకు ఈ టోర్నీ జరగనుంది. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్న సంగతి తెలిసిందే.

ఒలింపిక్స్‌కు భారత షూటర్లు

రైఫిల్ విభాగంలో :

* సందీప్ సింగ్, అర్జున్ బబుతా, ఎలవెనిల్ వలరివన్, రమితా (10 మీటర్లు)

* సిఫ్ట్ కౌర్, అంజుమ్ మౌడ్గిల్,  ఐశ్వరీ ప్రతాప్ తోమర్, స్వప్నిల్ కుసాలే  (50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్) 

పిస్టల్ విభాగంలో:

* సరబ్‌జోత్ సింగ్, అర్జున్ చీమా, మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్ (10 మీటర్లు)

* ఇషా సింగ్, మనూ భాకర్ (25 మీటర్లు )

* అనీష్ (25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ )