calender_icon.png 5 October, 2024 | 4:44 PM

ఐసెట్ ప్రత్యేక ఫేజ్ సీట్లు కేటాయింపు

05-10-2024 02:19:43 AM

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ స్పెషల్ ఫేజ్ సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. 268 కాలేజీల్లో 28,623 ఎంబీఏ సీట్లకు 25,690 సీట్లు భర్తీ అయినట్టు అధికారులు తెలిపారు. 89 ఎంసీఏ కాలేజీల్లో 6,966 సీట్లకు 5,878 సీట్లు భర్తీ అయ్యాయి. ఎంబీఏలో 89.8 శాతం, ఎంసీఏలో 84.4 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 7లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు.