calender_icon.png 16 January, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి ఐసెట్ సర్టిఫికెట్ వెరికేషన్

03-09-2024 12:57:34 AM

కన్వీనర్ కోటా సీట్లు 28,572 

హైదరాబాద్,సెప్టెంబర్ 2(విజయ క్రాంతి): టీజీ ఐసెట్ అభ్యర్థులకు  ఈనెల 3(మంగళవారం) నుంచి 9వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 10,634 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజును చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నట్లు తెలిపారు. ఎంబీఏ, ఎంసీఏలో కలిపి మొత్తం 28,572 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 264 ఎంబీఏ కాలేజీల్లో మొత్తం ఇన్‌టేక్ 33,629 ఉండగా, అందులో కన్వీనర్ కోటా సీట్లు 23,989 ఉన్నాయి. 65 ఎంసీఏ కాలేజీల్లో ఇన్‌టేక్ 6,162 ఉండగా, ఇందులో కన్వీనర్ కోటా కింద 4,583 సీట్లున్నాయని తెలిపారు.