04-03-2025 12:00:00 AM
అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శక త్వం వహించిన ఈ కాన్సెప్ట్ -సెంట్రిక్ మూవీ ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ టీజర్ రిలీజ్ అయింది. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘అందమా అందమా’ను సోమవారం విడుదల చేశారు. ‘
అందమా అందమా.. నువ్వు నా సొంత మా.. స్నేహమా మోహమా.. తేల్చవా ప్రాణమా.. నీ పరిచ యం ఓ చిత్రమా.. నీ దర్శనం ఆ చైత్రమా.. నీ సన్నిధి ఓ సౌఖ్యమా.. నాతో అడుగులు వేస్తావా ప్రేమా..’ అంటూ సాగుతోందీ పాట. హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపర్చిన ఈ లవ్‌మెలోడీకి వనమాలి సాహిత్యం అందించారు.
హేషమ్ అబ్దుల్ వాహబ్, ఆవాని మల్హర్‌తో కలిసి ఆలపించిన ఈ పాటలో హీరో హనురెడ్డి, హీరోయిన్ అనంతిక బ్యుటీఫుల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు.