calender_icon.png 19 April, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇవేనా అచ్చే దిన్?

10-04-2025 12:10:55 AM

పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలను వెనక్కి తీసుకోవాలి

కేంద్ర పెట్రోలియం మంత్రికి కేటీఆర్ బహిరంగ లేఖ

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): పెట్రో రేట్లను సెస్సుల రూపంలో పెంచుతూ మోదీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీకి పాల్పడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వసూలైన సెస్‌లను రాజకీయ ప్రచారాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.

పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలంటూ కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ పూరీకి బుధవారం బహిరంగ లేఖ రాశారు. భూటాన్, పాకిస్థాన్, శ్రీలంకలో కూడా మనదేశం కంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. ఎల్పీజీ ధర పేద, మధ్య తరగతి ప్రజలకు మోయలేని భారంగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా పెట్రో రేట్లు పెంచడమే అచ్చే దిన్ అనుకోవాలా అని ప్రశ్నించారు. ఇంధన ధరల పెం పును ఉపసంహరించుకొని, రాష్ట్రా లకు ఇవ్వని సెస్‌లను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సవివరంగా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.  కొట్లాడి తెచ్చుకున్న తె లంగాణ రాష్ట్రాన్ని పాలన చేతకాక దివాళా తీయిస్తున్నారని ఎక్స్ వేదికగా కేటీఆర్ మం డిపడ్డారు. 

అహ్మదాబాద్‌లో గాంధీపాత్ర

రేవంత్‌రెడ్డి అహ్మదాబాద్‌లో జరుగుత న్న పార్టీ సమావేశాల్లో గాంధీ పాత్ర పోషిస్తూ, తెలంగాణలో మాత్రం పౌరుల ప్రజాస్వామ్య హక్కులను బుల్డోజ్ చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. హెచ్‌పీయూ విద్యార్థులకు అండగా, హైదరాబాద్ జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు మద్దతుగా తమ నేతలు కొణతం దిలీప్, క్రిశాంక్ పోస్టులు పెట్టినందుకు రేవంత్‌రెడ్డి పోలీసులు వారిని 9 గంటలుగా ప్రశ్నిస్తున్నారని ఎక్స్ వేదికగా ఆరోపించారు. అనధికారికంగా సోదాలు చేస్తామని బెదిరిస్తున్నారన్నారు.