calender_icon.png 10 January, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమకు కారణం ఇదేనా!

02-07-2024 12:05:00 AM

ప్రేమ ఓ అందమైన అనుభూతి. అందుకే ప్రేమలో పడిన కొత్తలో చాలామంది గాల్లో తేలినట్లు ఫీల్ అవుతుంటారు. ఆ సమయంలో ఎప్పుడూ లేని కొత్తకొత్త ఫీలింగ్స్ కలుగుతాయి. అయితే మనలో విడుదలయ్యే కొన్ని హార్మోన్ల కారణంగానే ఈ ఫీలింగ్స్ కలుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నిసార్లు అందమైన వ్యక్తిని చూసినా మనలో ప్రేమ పుట్టదు. అందుకు కారణం కూడా హార్మోన్లేనట.

డోపమైన్ అనే హార్మోన్ ఒక వ్యక్తిని చూడగానే సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ వ్యక్తిని మళ్లీ మళ్లీ చూడాలనే కోరిక ఈ హార్మోన్ వల్లే కలుగుతుందట. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ వల్ల తనతో జీవితం పంచుకోవాలని అనిపిస్తుంది. తన గురించి పూర్తిగా తెలియకపోయినా మంచి అభిప్రాయం కలిగి నమ్మకం ప్రారంభిస్తాం. ఇక సెరటోనిన్ హార్మోన్ మన మానసిక స్థితిని ఉత్తేజపరుస్తుంది. దీనివల్లే మనం ఇష్టపడే వ్యక్తితో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం.