calender_icon.png 31 October, 2024 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇదే తొలి చిత్రమా..?

27-06-2024 12:25:19 AM

“ఈ కథతో ఏ భాషలో అయినా నటించవచ్చు. కళ్ళతో పలికించే భావోద్వేగాలకు భాష అనేది అడ్డంకి కాదు” అని ‘కల్కి’ ద్వారా తెలుగు సినిమా కోసం పనిచేయడం గురించి ఇటీవల తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది కథానాయిక దీపిక పదుకుణె. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ చిత్రంతో తొలిసారి తెలుగు తెరపై కనపడనున్న దీపికకు ఇదే తొలి తెలుగు సినిమా అని అనుకోవడం సహజం.

అయితే దీనికి ముందే ఆమె ఓ తెలుగు సినిమా చేశారన్నది మీకు తెలుసా..? 2007లో దర్శకుడు జయంత్ సి పరాన్జీ స్వీయ నిర్మాణంలో ‘లవ్ 4 ఎవర్’ అనే సినిమా ఆరంభించారు. నూతన నటులైన రణదీప్, మృదుల హీరో హీరోయిన్లుగా ఎంపికైన ఈ సినిమాలో దీపిక ఓ ప్రత్యేక పాత్రలో నటించడంతో పాటు, ఓ గీతానికి ఆడిపాడారు. అయితే పలు కారణాల వల్ల ఆ సినిమా తెరమీదికి రాలేదు. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమా వైపు చూసిందీ లేద. తర్వాత ఇంత కాలానికి అది ‘కల్కి’ ద్వారా సంభవమైంది.