calender_icon.png 16 November, 2024 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా? : హరీష్ రావు

09-11-2024 01:12:07 PM

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు పక్క రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్లడాన్ని హరీష్ రావు తప్పుబట్టారు. రాష్ట్రంలో సమస్యలు గాలికి వదిలి పక్క రాష్ట్రాల ప్రచారానికి వెళ్తున్నారని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు లేవు, మంత్రి సీతక్క సొంత జిల్లాలో పత్తికి మద్దతు ధర లేదు, ఆహర కల్తీ విషయంలో ముఖ్యమంత్రికి పట్టింపే లేదన్న హరీష రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మార్పు ఇదేనా..? అంటూ హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.