calender_icon.png 19 November, 2024 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ సమస్య వేధిస్తోందా!

02-11-2024 12:00:00 AM

కొంతమందిని మొటిమల సమస్య విపరీతంగా వేధిస్తుంది. ఎన్ని క్రీమ్స్, లోషన్స్.. ట్రై చేసినా ఈ సమస్య పదే పదే వస్తుంటుంది. అలా కాకుండా చిన్న చిన్న మార్పుతో కూడా మొటిమల సమస్యను నివారించవచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటో చూసేయండి. 

* చాలామంది ఈ మొటిమలను చేతులతో గిల్లుతుంటారు. దీని కారణంగా చర్మంపై నల్లని గుర్తులు ఏర్పడతాయి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు మొటిమల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారు. మొటిమల నుంచి ఉపశమనం పొందాలంటే రోజుకు రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి. 

* శుభ్రంగా కడుక్కోవడం వల్ల ముఖంపై అంటుకున్న దుమ్ము, ధూళి అన్నీ తొలగిపోతాయి. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి సున్నితమైన క్లెన్సర్ ఉపయోగించాలి. ముఖం కడిగిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. 

* చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. దీనికోసం రోజూ తగినంత నీరు తాగాలి. నీరు సరిపడా తాగడం వల్ల చర్మ సమస్యలు దూరం అవ్వడంతో పాటు హైడ్రేట్‌గా ఉంటారు. 

* ముఖంపై క్రీమ్‌ను అప్లు చేసే ముందు చేతులు, గోళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై బ్యాక్టీరియాను వ్యాప్తి చెందదు. అలాగే విటమిన్ ఎ, బి12, సితో పాటు బీట్‌రూట్, ఆరెంజ్, బాదం డైట్‌లో తీసుకోవాలి. మొటిమలు నివారించడంలో వీటి పాత్ర చాలా కీలకం.