మాజీ మంత్రి కొప్పుల
హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి సర్కారు ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తోందని, ఇందిరమ్య పాలన అంటే ఇదేనా? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం ఒక ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్టును కొప్పుల తీవ్రంగా ఖండించారు.
నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తా రని మండిపడ్డారు. నేరం చేసి ఉంటే ముందుగానే నోటీసులు ఇవ్వాలని సూచించారు. ఎన్ని కేసులు పెట్టి జైలు కు పంపినా బీఆర్‌ఎస్ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. వెంటనే ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.