- ఇంటర్మీడియెట్ గోదాముల్లోని ధాన్యం అక్కడేనా!
- అధికారికంగా గోదాముల్లో 9,309.520 మెట్రిక్ టన్నులు
- అనధికారికంగా మరో 3,325.320 మెట్రిక్ టన్నులు
మంచిర్యాల, డిసెంబర్ 28 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో 2022 యాసంగి సీజన్‌లో రైతుల కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన 92,168.840 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు ఆయా మిల్లులతో పాటు ఇంటర్మీడియట్ గోదాములకు పంపించారు.
ఇందులో 63,144.170 (రైస్ మిల్లుల్లో 53,834.650, గోదాముల్లో 9309.520) మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 2023లో టెండర్ వేయగా కేంద్రీయ భండార్ సంస్థ ఆక్షన్‌లో దక్కించుకుంది. ఇప్పటివరకు 9,496.770 (రైస్ మిల్లుల నుంచి 7,798.666, గోదాముల నుంచి 1,698.104) మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకెళ్లిన సంస్థ ఇంకా 53,647. 400 మెట్రిక్ టన్నులు జిల్లాలోని మిల్లులు, గోదాంల నుంచి తీసుకెళ్లాల్సి ఉంది.
2022 యాసంగి సీజన్‌కు సంబంధించి 9,309.520 మెట్రిక్ టన్నులు జిల్లాలోని ఏడు ఇంటర్మీడియట్ గోదాంల్లో మూడు ఏజెన్సీలకు సంబంధించిన ధాన్యా న్ని నిల్వ చేశారు.
డీసీఎంఎస్ ఏజెన్సీకి సం బంధించి 3,192.480 (తీగల్‌పహాడ్ గోదాంలో 2,305.960, వేమనపల్లి గోదాంలో 886. 520) మెట్రిక్ టన్నులు, డీఆర్‌డీఏ ఏజెన్సీకి సంబంధించి భీమారం ఏఎంసీ గోదాంలో 1,435.760 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ ఏజెన్సీకి సంబంధించి 4,681.280 (చెన్నూర్ ఏఎంసీలో 548.680, వేమనపల్లి ఏఎంసీలో 899.400, కాసిపేట ఏఎంసీలో 1,675.320, తీగల్‌పహాడ్ గోదాంలో 1,557.880) మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ చేశారు.
గోదాముల్లోని ధాన్యం ఎక్కడ?
జిల్లాలో ఏడు గోదాముల్లో నిల్వ ఉంచిన ధాన్యం అసలు ఉందా! లేదా! అనేది ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. అధికారికంగా గోదాముల్లో 9,309.520 మెట్రిక్ టన్నుల్లో డీఆర్‌డీఏకు సంబంధించి భీమారం ఏఎంసీ గోదాం నుంచి 499.954 మెట్రిక్ టన్నులు మాత్రమే టెండర్ వేసిన కేంద్రీయ భండార్ సంస్థ లిఫ్ట్ చేసి అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చింది.
డీసీఎంఎస్ ఏజెన్సీకి సంబంధించి తీగల్‌పహాడ్ గోదాం నుంచి దాదాపు 999.954 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిల్వ ఉంచిన ధాన్యంలో చెన్నూర్ ఏఎంసీ నుంచి 99.282 మెట్రిక్ టన్నులు, తీగల్‌పహాడ్ గోదాం నుంచి 98.914 మెట్రి క్ టన్నులు ఇలా ఇప్పటి వరకు 1,698.104 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బిడ్డర్ ఇంటర్మీడియట్ గోదాముల నుంచి తరలించారు.
అలాగే ఒక మిల్లు పేరిట నిల్వ చేసిన 3,325.320 మెట్రిక్ టన్నుల ధాన్యం బిడ్డర్ తీసుకెళ్లాడా? లేదా? తీసుకెళ్లకుంటే ఎందుకు తీసుకెళ్లలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం టెండర్‌లో పాడుకున్న వ్యక్తి తీసుకెళ్లకుంటే సదరు మిల్లును అధికారులు ఎందుకు డిఫాల్ట్‌లో పెట్టారనేది అర్థం కాని ప్రశ్న.
తప్పిదం టెండర్ పాడిన వ్యక్తిదా! లేదా అధికారులదా! తేలాల్సి ఉంది. ఏదీ ఏమైనా ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
అనధికారికంగా..
ఇంటర్మీడియట్ గోదాముల్లో అధికారికంగా 9,309.520 మెట్రిక్ టన్నులు దించగా అనధికారికంగా మరో 3,325.320 మెట్రిక్ టన్నులు అక్కడ నిల్వచేసినట్లు సమాచారం. ఆ సమయంలో మిల్లుల్లో ధాన్యం నిండుకోగా అప్పటి అధికారులు కొనుగోలు కేంద్రాల నుంచి వివిధ ఏజెన్సీలు సేకరించిన ధాన్యాన్ని ఏ డు ఇంటర్మీడియట్ గోదాముల్లో నిల్వ చేశారు.
ఏజెన్సీలు ఇచ్చిన ఆర్‌వోల ప్రకారం మొత్తం 12,634. 840 మెట్రిక్ టన్నులు ఆయా గోదాముల్లో దింపినట్లు తెలుస్తోంది. రైతు లకు డబ్బులు చెల్లించేందుకు ఓపీఎంఎస్‌లో వివరాలు ఎంట్రీ చేసేం దుకు 3,325.320 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఒక మిల్లు పేరుతో ట్యాగింగ్ చేసినట్లు తెలిసింది.