గోవాలోని పణాజీలో భారతీయ అంతర్జాతీ య సినిమా పండు గ జరుగుతోంది. ఈ వేడుకల్లో తొలిరోజు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు పాల్గొన్నారు. ‘సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ’ అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఖుష్బూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు అన్నిచోట్లా ఇబ్బందులున్నాయని.. ఏదైనా నిర్ణయం మన చేతుల్లోనే ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఖుష్బూ వివరించారు.
“గతంలో ఓ సినిమా సెట్లో ఓ హీరో నాతో ‘నాకు ఏదైనా ఛాన్స్ ఉందా? అని అడిగాడు. వెంటనే నా చెప్పుల సైజ్ 41.. ఇక్కడ కొట్టనా? లేదంటే సెట్లో అందరి ముందు కొట్టనా? అని అడిగా. సినిమా మాధ్యమంగా ప్రేక్షకులను అలరించాలని పరిశ్రమలోకి వచ్చా. ఏ విషయంలోనూ రాజీ పడకుండా పని చేశా” అని ఖుష్బూ వెల్లడించారు. ఆమెని అలా అడిగిన హీరో ఎవరా? అని కొందరు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఖుష్బూ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.