calender_icon.png 25 December, 2024 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షేక్ హసీనాపె అరెస్ట్ వారెంట్?

25-12-2024 03:00:20 AM

500 బిలియన్ డాలర్ల అక్రమ సంపాదన

అణువిద్యుత్ ప్లాంట్‌లో నిధుల దుర్వినియోగం

విచారణకు బంగ్లా ప్రభుత్వం ఆదేశం

ఢాకా, డిసెంబర్ 24: బంగ్లా మాజీ ప్రధా ని షేక్ హసీనా 5 బిలియన్ డాలర్ల అవినీతికి పాల్పడ్డారని బంగ్లా ప్రభుత్వ ఆరోపిం చింది. ఆమెపై దర్యాప్తు  చేసేందుకు ఆదేశా లు ఇచ్చింది. ఈ కేసులో హసీనాతో పాటు మరికొందరిపై అరెస్ట్ వారెంట్‌ను ప్రభుత్వం జారీ చేసినట్లు తెలిసింది.  ఢాకాకు పశ్చిమా న 160 కి.మీ. దూరంలో ఉన్న రూప్‌పూర్‌లో పద్మానది ఒడ్డున మొద టి బంగ్లాదేశ్ అణువిద్యుత్ ప్లాంట్‌ను రష్యా ప్రభుత్వం నిర్మిస్తున్నది.

ఈ నిర్మాణంలో కొన్ని భారతీయ కం పెనీలు కూడా పాల్గొంటున్నాయి. అయితే ఈ అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు లో హసీనా 5 బిలియన్ డాలర్ల  అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభు త్వం దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు బంగ్లా మీడియా పేర్కొన్నది. దీంతో షేక్ హసీనాతో పాటు ఆమె కుమారుడు సజీబ్ వాజెద్, ఆ మె మేనకోడలైన బ్రిటన్ ట్రెజరీ మంత్రి తు లిప్ సిద్ధిఖీల ను ప్రశ్నించనున్నట్లు తెలిసింది.

ఇందుకోసం యూనస్ నేతృత్వంలోని ప్రభు త్వం, యాంటీ కరప్షన్ కమిషన్(ఏసీసీ) రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించినట్లు బంగ్లా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే  అణు విద్యుత్ ప్లాంట్‌కు కేటా యించిన నిధుల్లో నుంచి 5 బిలియన్ డాలర్ల అక్రమంగా మలేషియా బ్యాంకుకు బదిలీ చే సినట్లు ఏసీసీ గుర్తించింది. దీనిపై స్థానిక హై కోర్టులో విచారణ జరగుతోంది. ఇంత భారీ గా అవినీతి జరిగినా ఏసీసీ ఎందుకు పట్టించుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.

దీంతో రెండురోజుల తరువాత బంగ్లా ప్రభు త్వం రంగంలోకి దిగి హసీనాతో పాటు ఆమె కుటుంబసభ్యులను విచారించేలా చర్యలు తీసుకున్నది.  రూప్‌పూర్ అణు విద్యుత్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని నేషనల్ డెమాక్రటిక్ మూవ్‌మెంట్ (ఎన్‌డీఎం) చైర్మన్ బాబీ హ జ్జాజ్ వెలుగులోకి తెచ్చారని ఏసీసీ తన నివేదికలో పేర్కొన్నది.