calender_icon.png 7 February, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాకోరుల గుండెల్లో గుబులు?

07-02-2025 12:19:10 AM

నిజామాబాద్‌లో పటిష్ట శాఖ నిడ్రా ఏర్పాటుకు చర్యలు

నిజామాబాద్ ఫిబ్రవరి 6: (విజయ క్రాంతి) : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో చెరువులు వాగులు కాలువలు కుంటల పరిరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. నిజామాబాద్ జిల్లాలో కబ్జాకు గురైన చెరువులు కాలువల వాగుల కుంటల భూములు అన్యాక్రాంతమైన అసైన్డ్ భూముల వివరాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నుండి నివేదిక కోరడంతో నిజామాబాద్ జిల్లాలోని భూకబ్జాదారుల గుండెల్లో గుబులు మొదలైంది.

కోట్లు ఖర్చుపెట్టి గుంటలను కాలువలను చెరువుల కబ్జా భూములను ను నాళాలను లెవెల్ చేసి వెంచర్లు వేసి ప్లాట్ల అడ్వాన్సులు తీసుకున్న రియాల్టర్ లకు నిద్ర పట్టడం లేదు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా మండలాల్లో కూడా చెరువులు వాగులు కాలువలు కుంటలు నాళాలు కబ్జాకు గురవుతూనే ఉన్నాయి.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని నానుడి సరిగ్గా పునికి పుచ్చుకున్న రాజకీయ నాయకుల అండదండలతో బినామీలతో అధికారులు భాగస్వామ్యంతో ప్రజా ఉపయోగకర భూములు అన్ని అన్యాక్రాంత మైపోయాయి.

నిజామాబాద్ జిల్లాలో చెరువులు కబ్జా అయ్యాయి నవీపేట మండలం దర్యాపూరు లో 30 ఎకరాల విస్తీర్ణం గల చెరువు ఉండగా ఇందులో దాదాపు పది ఎకరాల వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి భరణి నింపి నేలను నీళ్లను చదును చేసి ఆక్రమించుకున్నారు.

నిజామాబాద్ జిల్లా మొకంపల్లి లో 65 ఎకరాల శిఖం భూమిని అవినీతి అధికారులకు లంచాలు ఎరవేసి పట్టాలు చేసుకున్నారు ఈ విషయమై గ్రామస్తులు ఆందోళనకు దిగి జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు ఇదిలా ఉండగా భీంగల్ మున్సిపల్ పరిధిలో గల రాధం చెరువు భూములు దశాబ్దాల నుండి భూ కబ్జా దారుల కబంధ హస్తాల్లో ఉన్నాయి

రియల్ ఎస్టేట్ వ్యాపారులు. రాజకీయ నాయకులు అండదండలతో ప్లాట్లుగా విభజించి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శివారులో గల ఇందల్వాయి చెరువు ఎనభై ఎకరాలకు పైగా కబ్జాకు గురైంది.

కబ్జాకు గురైన ఈ భూముల్లో దర్జాగా బ్యాంకు లోన్ లోన్లతో డైరీ ఫార్ములాను నిర్మించి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. నందిపేట మండలంలోని రఘునాథ చెరువు కబ్జా చేశారు కాసులకు కక్కుర్తి పడిన అధికారులు ఇళ్లపట్టాలకు అనుమతి ఇవ్వడంతో కబ్జాదారులు  ఇల్లు కూడా నిర్మించారు.

 నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో ...

నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల నగర మధ్యలో నుండి పారే పొలం వాగు కుడి ఎడమ పక్క అడుగడుగునా కబ్జాలకు గురైంది. మాల మొదలయ్యే వాటర్ డిస్ట్రిబ్యూటర్ డి54 కెనాల్ చంద్రశేఖర్ కాలనీ వరకు కబ్జా అయింది డి54 కెనాల్ ఆడవాళ్ళే లేకుండా పోయాయి అర్సపల్లిలోని రామడు చెరువు పూర్తిగా కబ్జా కోరల్లోకి వెళ్ళింది

పక్కాగా కమర్షియల్ గ్యారేజీలు మెకానిక్ షెడ్లు ఇతర విక్రయ కేంద్రాలు వెలిశాయి. నగర శివారులోని డ్రైవర్స్ కాలనీ పెయింటర్స్ కాలనీ పహాడీ కాలనీ లో 50 ఎకరాలకు పైగా భూమి కబ్జాకు గురై అక్రమ ప్లాట్లు చేసి అమాయకులకు అంటగట్టి సొమ్ము చేసుకున్నారు.

నగరంతో పాటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాలలో అక్రమ భూకబ్జాలకు పాల్పడిన వారిలో ప్రజాప్రతినిధులకు చెందిన వారి కుటుంబ సభ్యులు బంధువులు వారి వద్ద ఏళ్లుగా పని చేసే పాలేరులు సైతం బినామీయులుగా ఉన్నారు. అక్రమ చెరువు భూములు వాగులతోపాటు భూములలో వెంచర్లు వేసి విక్రయాలకు పాల్పడ్డ బిల్డర్లు.

ప్రభుత్వం మారడంతో ప్రస్తుత ప్రజాప్రతినిధులను కలిసి కేసులలో నుండి తప్పించుకోవడానికి రాజధాని హైదరాబాదులో తిష్ట వేశారు. స్థానిక ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలను కలవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అసలే మంత్రివర్గ విస్తరణ సమయం ఏది ముట్టుకున్న ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి అన్న ఆలోచనలు ప్రజాప్రతినిధులు వీరిని తమ దరిదాపుల్లోకి రానివ్వడం లేదు.

ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ 82/2/1 వాటర్ డిస్ట్రిబ్యూటర్ కాలువ అడ్డగోలు ఆక్రమణలతో అసలే కనిపించకుండా పోతుంది. 70 ఫీట్లకు పైగా వెడల్పుతో మామిడిపల్లి కోట ఆర్మూర్ మీదుగా వెళ్లే ఈ కాలువ దాస్ నగర్ మాట్లూరు వద్ద నిజాంసాగర్ ప్రధాన కాలువ 68వ డిస్ట్రిబ్యూటరీ కాల్వను పూర్తిగా కబ్జా చేశారు.

ఇదంతా ఎలా జరుగుతుందంటే రాజకీయ పలుకుబడి కొందరు  అధికారుల లంచగొండి అవినీతి ద్వారానే యదేచ్చగా కబ్జాలకు పాల్పడుతున్నారు. తాము కబ్జా చేసిన కబ్జా చేసిన స్థలాలకి చుట్టూ ప్రహరీలు నిర్మించి సెక్యూరిటీ కాపాల పెట్టుకుంటున్నరు.

వెనక్కి తగ్గం

హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో ప్రభుత్వ భూములను పరిరక్షిస్తున్న విషయంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనక్కి తగ్గమని అలాగే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసి హైడ్రాలాగే పటిష్టమైన వ్యవస్థను నిజాంబాద్ ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్టు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

 మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు 

మాట నిలబెట్టుకోవాలి

చెరువులు వాగులు కుంటలు నాళాలలో అసైన్డ్ భూములలో నిర్మాణాలకు వెంచర్లకు అధికారులు డబ్బులకు కక్కుర్తి పడి పర్మిషన్లు ఇస్తున్నారు. రాజకీయ నాయకులు సైతం వారిపై ఒత్తిడి తెస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉంది. హైదరాబాదు లాగే నిజామాబాద్ లో నిడ్రా ను ఏర్పాటు చేయాలి. మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి 

 కోయేటి నరసింహులు,  కమ్యూనిస్ట్ జిల్లా నాయకులు

కాసులకు కక్కుర్తి పడుతున్నరు

నిజామాబాద్ నగరంలో హైదరా బాదులో హైడ్రోలాగా శాఖను ఏర్పాటు చేస్తామని టీఎస్పీసీ అధ్యక్షుడు హామీ ఇచ్చారు. వెంటనే చెరువుల భూమి పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. నూతనంగా నిర్మించిన అశోక్ ఎలైట్ అపార్ట్మెంట్ లకు సంబంధించి క్లబ్ హౌస్ నిర్మించారు ఈ నిర్మాణం పూర్తిగా పాన్ రా వాగు లోఆక్రమ నకు గురైంది. వాగు ఆక్రమణను చూసి చూడనట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. పైగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ నిర్మాణానికి కాసులకు కక్కుర్తి పడి అనుమతి ఇచ్చారు.

 దొంతు రవి, బీజేపీ నగరనాయకుడు