* 3 దశాబ్దాలుగా హామీగానే నిర్మల్ లైన్
* ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసుల ఎదురుచూపులు
* ఇందూరులో పసుపుబోర్డు ఏర్పాటుతో మళ్లీ తెరపైకి
* గత ఎన్నికల్లో జాయింట్ ప్రాజెక్ట్‌గా ప్రభుత్వాల ప్రకటన
* లైన్ పూర్తయితే రాజధానికి తగ్గనున్న దూరభారం
నిర్మల్, జనవరి 16 (విజయక్రాంతి): నిజామబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో ఈ ప్రాంత రైతులు, ప్రజలు హర్షిస్తున్న నేపథ్యంలో నిర్మల్ రైల్వేలైన్ నిర్మాణంపై తీవ్ర చర్చ జరుగుతోంది. మూడు దశాబ్దలుగా ప్రతీ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయా పార్టీలు లైన్ నిర్మాణంపై హామీలు గుప్పిస్తూ ఓట్లు దండుకుంటున్నాయి. ఆ తర్వాత అంతా షరామామూలే అన్నట్లు పరిస్థితి తయారైంది.
రైల్వేలైన్ నిర్మాణంపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంపై నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.1992లో అప్పటి ప్రధాని పీవీ నిర్మల్ జిల్లాకు వచ్చినప్పుడు పెద్దపల్లి రైల్వేలైన్‌తో పాటు ఆర్మూర్ రైల్వేలైన్ ప్రాధాచ్ ఉత్తర తెలంగాణలో ఈ రెండు లైన్లను రైల్వే కనెక్టివిటీ చేస్తామని ప్రకటించారు.
దీంతో ప్రాంత ప్రజలు రైల్వేలైన్‌పై ఆశలు పెంచుకున్నారు. అయితే పీవీ ప్రకటించిన పెద్దపల్లి రైల్వేలైన్ పూర్తయ్యినా, నిర్మల్‌ఆర్మూర్ లైన్ నిర్మా మాత్రం రెండడుగులు ముందు నాలుగడుగులు వెనక్కి అన్నట్లు సాగుతుంది.
గత ఎన్నికల్లో జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జిల్లాకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా రైల్వే లైన్ నిర్మాణంపై స్పందించినా, ఇప్పటివరకు నిధులు విడుదల కాకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మూడు దశాబ్దాలుగా..
నిర్మల్ రైల్వేలైన్ ఏర్పాటు మూడు దశాబ్దాలుగా ఎన్నికల హమీగానే మిగిలింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ ఎన్నికల్లో రైల్వేలైన్ నిర్మాణంపై పోటాపోటీగా ప్రచారం చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీలుగా గెలిచిన వారు రైల్వేలైన్ నిర్మాణంపై ప్రజలకు ఎన్నికల హామీలు ఇచ్చిన వారే.
ఇందులో ఎంపీలుగా గెలిచిన వారిలో నిర్మల్‌కు చెందిన ఎస్ వేణుగోపాలచారి, రెండు ఎంపీగా గెలిచిన జీ నగేశ్‌తో పాటు నిర్మల్‌కు చెందిన మాజీమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖానాపూర్‌కు చెందిన రాథోడ్ రమేశ్, మధుసూదన్‌రెడ్డి, పీ నర్సారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్‌కు చెందిన మాజీ జోగురామన్న, స్వర్గీయ రాం పడాల భూమన్న తదితరులు రైల్వేలైన్‌పై హమీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు.
2018లో అప్ప సీఎం కేసీఆర్ నిర్మల్ రైల్వేలైన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ప్రాజెక్టుగా చేపడతామని ప్రకటించారు. ఆర్మూర్ వరకు పెద్దపల్లి రైల్వేలైన్ ఉండగా, అక్కడి నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వేలైన్ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ఇందుకు రూ.2,800 కోట్లు అవస రాష్ట్ర వాటాగా రూ.1,400 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు.
ప్రధానితో పాటు రైల్వేశాఖ మంత్రిని ఎంపీలు కలిసి రైల్వేలైన్ నిర్మాణం త్వరలో చేపట్టనున్నట్లు ప్రకటించడంతో ఇక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. రైల్వేలైన్ నిర్మాణానికి దక్షిణ మధ్యరైల్వే సర్వే పనులు చేస్తుం అందుకు రూ.69 కోట్లు విడుదల చేసినట్టు తెలిపినా, ఇప్పటికీ ముందడుగు పడలేదు.
మూడు దశాబ్దాలుగా పసుపు బోర్డు కోసం రైతులు పోరాటాలు చేయడంతో కేంద్రప్రభుత్వం అక్కడి ఎంపీ అర్వింద్ హమీ మేరకు జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నిర్మల్ ఆర్మూర్ రైల్వే లైన్ నిర్మాణంపై కూడా స్పందించి న్యాయం చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
రైల్వేలైన్‌తో మరింత అభివృద్ధి..
నిర్మల్ కేంద్రంగా ఆర్మూర్ రైల్వేలైన్ ఏర్పడితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. ప్రస్తుతం ఆదిలాబాద్ బాసరలో రైల్వే సదుపాయమున్నా, అది మహారాష్ట్రతో లింక్ ఉంది. ఆదిలాబాద్ వారు హైదరాబాద్, నిజమాబాద్ వెళ్లాలంటే ఆదిలాబాద్, కిన్వట్, హిమాయత్‌నగర్, బోఖర్, ముఖేడ్, ఉమ్రి, ధర్మాబాద్ మీదుగా బాసరకు వచ్చి అక్కడి నుంచి నిజామాబాద్ వయా సికింద్రాబాద్, హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది.
ఆదిలాబాద్, హైదరాబాద్ మధ్య 310 కిలోమీటర్ల దూరం ఉండగా రైల్వేలైన్ మహారాష్ట్ర నుంచి ఉండటం వల్ల 580 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీని వల్ల ప్రయాణ సమయం అధికమవడంతో పాటు, చార్జీల భారమూ పెరుగుతుంది.
ఈ నేపథ్యంలో చాలా మంది బస్సుల్లో ప్రయాణించడానికి ప్రాధాన్యమిస్తున్నారు. అయితే నిర్మల్ లైన్ ఏర్పాటు చేస్తే 320 కిలోమీటర్ల ప్రయాణంతో హైదరాబాద్ చేరుకోవచ్చు. అంటే 260 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ప్రస్తుతం ఆర్మూర్ వరకు రైల్వేలైన్ ఉండగా, నిర్మల్ ఆదిలాబాద్‌కు కొత్తలైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆర్మూర్ దూరం 110 కిలోమీటర్లు దూరం ఉంది.
తాజాగా ఎంపీ నాగేశ్, ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పటేల్ ప్రధాని నరేంద్రమోదీని, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి రైల్వేలైన్ విషయమై విన్నవించిన నేపథ్యంలో ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.
రైల్వేలైన్ నిర్మించాలి
నిర్మల్ జిల్లా కేంద్రానికి రైల్వేలైన్ లేకపో చాలా ఇబ్బందులు కలుగుతున్నా నేను చదువుకొనే రోజుల్లో రైల్వేలైన్ ఏర్పాటు చేస్తామని అప్పటి లీడర్లు చెప్పటంతో ఎంతో సం 20 ఏండ్ల నుంచి ప్రతీసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు లైన్ ఏర్పాటుకు కృషి చేస్తామనిచె ఆ తర్వాత పట్టిం పరిపాటిగా మారింది. నిర్మల్ జిల్లా కేంద్రానికి రైల్వేలైన్ చాలా అవసరం. వెంటనే ప్రభుత్వాలు ఆమేరకు చర్యలు చేపట్టాలి
నిర్మల్ రైల్వేలైన్ కోసం మరో ఉద్యమం
పరిపాలన సౌలభ్యం కోసం 2016లో అప్పటి సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో నిర్మల్ జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమించాం. నిర్మల్ జిల్లా ఏర్పడితే ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని, పరిపాలన సులభతరమవుతుందని ప్రజల డిమాండ్‌ను బలంగా ప్రభుత్వానికి వినిపించాం.
దీంతో ప్రభుత్వం నిర్మల్‌ను జిల్లాగా ప్రకటించింది. 1992 నుంచి నిర్మల్ ఆర్మూర్ రైల్వేలైన్ నిర్మాణం డిమాండ్ ఉన్నా నేటికి నెరవేరలేదు. త్వరగా రైల్వేలైన్‌ను ఏర్పాటు చేయకుంటే ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాం.
నంగే శ్రీనివాస్, నిర్మల్